అడ్డగూడూరు మండల బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు
అడ్డగూడూరు19 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీని చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసే ఉద్దేశంతో గురువారం రోజు ప్రజాభవన్ ముట్టడికి వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను అడ్డగూడూరు పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.అనంతరం మాజీ యంపిటీసి పూలపెల్లి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణలో ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రూపాయలు 2లక్షల రూపాయలు వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు తప్పా అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు.ఇప్పటికయిన రైతులకు రుణమాఫీ వెంటనే చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల బిసి సెల్ మండల అధ్యక్షులు కడారి సైదులు,పట్టశాఖ అధ్యక్షులు నాగులపెల్లి దేవగిరి,బిఆర్ఎస్ మండల నాయకులు పరమేష్ గూడెపు,పట్టణశాఖ ప్రధాన కార్యదర్శి గజ్జెల్లి రవి,పట్టశాఖ యువజన విభాగం అధ్యక్షుడు గూడెపు నరేష్,నాయకులు బాలెంల రాజు బిఆర్ఎస్ బిసి సెల్ మండల కార్యదర్శి పయ్యావుల మత్య్సగిరి తదితరులు పాల్గొన్నారు.