ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా" ర్యాలీని ప్రారంభించిన డిఎంహెచ్ఓ డాక్టర్ శశికళ
జోగులంబ గద్వాల 25 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శశికళ. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఈరోజు పాత డీఎంహెచ్ఓ ఆఫీస్ నుండి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.. ఇట్టి ర్యాలీ పలు నినాదాలతో పాత బస్టాండ్ వరకు కొనసాగించారు... డి యంహెచ్ఓ మాట్లాడుతూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనలు మేరకు 2030 సంవత్సరం నాటికి మలేరియా నిర్మూలనకు అందరూ కూడా కృషి చేయాలని.. అన్ని గ్రామాల యందు పట్టణాల యందు నీటి నిల్వలు ఉండకుండా ప్రతి శుక్రవారం ప్రతి ఒక్కరూ డ్రైడే ప్రోగ్రామ్ నిర్వహించాలని ఆశా కార్యకర్తలకు సిబ్బందికి తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో MHN ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ స్రవంతి , డాక్టర్ జి రాజు * , సి హెచ్ ఓ *రామకృష్ణ , సబ్ యూనిట్ ఆఫీసర్ శివన్న, హెల్త్ ఎడ్యుకేటర్ మధుసూదన్ రెడ్డి, సీసీ వెంకటేష్ ,జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్లు శ్యాంసుందర్, మక్షుద్.. గద్వాల అర్బన్ సెంటర్స్ లక్ష్మీ ,పార్వతమ్మ హనుమంతు, నర్సింలు, అబ్రహం, హెల్త్ అసిస్టెంట్ కృష్ణ ,ఏఎన్ఎంలు మరియు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.