ఇకపై మండల స్థాయిలో ప్రజావాణి ఎంపీడీవో.

Aug 5, 2026 - 16:24
 0  1
ఇకపై మండల స్థాయిలో ప్రజావాణి ఎంపీడీవో.

జోగులాంబ గద్వాల 5ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :- మండలంలోని ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిర్వహించింది. ఇకపై ప్రతి సోమవారము రాష్ట్రవ్యాప్తంగా మండలాల్లో చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది.  ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఇటిక్యాలఎంపీడీవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రజలు వినతులను ప్రజావాణి పోస్టల్ ద్వారా నమోదు చేసి సంబంధించిన శాఖల సమన్వయతో పరిష్కరించనున్నారని ఇటిక్యాలఎంపీడీవో రమాదేవి తెలిపారు.  ఇటిక్యాల మండలంలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో రమాదేవి కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333