శివాలయం నిర్మించాలి
తిరుమలగిరి 20 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
శివాలయం ఆనవాళ్లు ఉన్న స్థలంలో శివాలయాన్నే నిర్మించాలని తొండ గ్రామ ప్రజలు గ్రామ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా పలువురు గ్రామ ప్రజలు మాట్లాడుతూ గ్రామంలోని 353 సర్యే నంబర్లో 16 గుంటల ప్రభుత్వ భూమి ఉండగా అందులో శివుని ఆనవాళ్లు కలిగిన నంది, సూర్యుడి, వినాయక, సప్తమంత్రికుడి విగ్రహాలు ఉన్నాయని జిల్లా పురావస్తూ అసిస్టెంట్ డైరెక్టర్ గ్రామాన్ని సందర్శించి కాక తీయుల పరిపాలనలోని ప్రతాపరుద్రుడి కాలం నాటివని చెప్పారన్నారు ఇంతటి చరిత్ర కలిగిన స్థలంలో మహిళా సంఘము భవనం కానీ మరేదైనా భవనం నిర్మించకుండా శివాలయం మాత్రమే నిర్మించాలన్నారు.
లేనట్లయితే ఆందోళన చేసి మహిళా సంఘ భవన నిర్మాణాన్ని అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో గొడుగు రమేష్,ఓడపెల్లి వెంకన్న, వేల్పుల బంగారి,చింతకింది సోమనారాయణ,కందుకూరు లక్ష్మయ్య, చింత కింది వాసు, గొడుగు నవీన్, చిత్తలూరు బిక్షం,ఎళ్ళాంలా సోమక్క, ఓడపెల్లి సాయమ్మ, నిమ్మల ముత్తమ్మ,కొత్త ముత్తమ్మ తొట్ల అంజమ్మ, వడ్లకొండ మంగమ్మ,చిత్తలూరి మంజుల,చిత్తలూరు స్వరూప, తొట్ల రేణుక, ఎల్లoల లక్ష్మి,చిత్తలూరు యాదమ్మ, ముత్యాల విజయ,ముత్యాల హైమ, సారికొల్ల గంగమ్మ,భూతం శోభ, వేల్పుల అంజమ్మ, కందుకూరి కనకమ్మ, రెడ్దిమల్ల దేవకమ్మ, ఓడపెల్లి సోమరాములు, వేల్పుల కొండమ్మ తదితర గ్రామప్రజలు పాల్గొన్నారు.