ఘనంగా సుంకరి శ్రీనివాస్ ఉద్యోగ విరమణ ఆత్మీయ సమావేశం
ఆత్మీయ సమావేశంలో పెద్దసంఖ్యలో పాల్గొన్న కార్మిక సంఘాల నాయకులు
సూర్యాపేట 16 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- సూర్యాపేట డిపో నందు ఆర్టిసి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సుంకరి శ్రీనివాస్ నిరంతరం కృషి చేశారని సూర్యాపేట శాసనసభ్యులు, మాజి మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఆదివారం నాడు ఐఎమ్ ఎ ఫంక్షన్ హాల్ నందు జరిగిన సుంకరి శ్రీనివాస్ ఉద్యోగ విరమణ ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టిసి ఇడి పురుషోత్తం మాట్లాడుతూ సుంకరి శ్రీనివాస్ డిఎం శ్రీనివాస్ గా పేరు తెచ్చుకున్నారని అన్నారు. ఆర్టిసిలో కండక్టర్ గా ఉద్యోగం లో చేరి 34 సంవత్సరాల పాటు పనిచేశారని, 15 సంవత్సరాల పాటు యూనియన్ కార్యదర్శి గా విశేష సేవలు అందించారని ఆయన అన్నారు.
ఆర్టిసి యాజమాన్యం, కార్మికులతో స్నేహపూర్వక సంబంధాలు కలిగి వున్నారని అన్నారు. తన స్వంత ఖర్చులతో డిపోలో ఫ్యాన్ ల ఏర్పాటు చేశారని అన్నారు. ఐదు సంవత్సరాల సర్వీసు వున్నప్పటికి ఆరోగ్య కారణాలతో , స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేస్తున్న సుంకరి శ్రీనివాస్ కు పలువురు ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు. వారు శేష జీవితాన్ని సంతోషంగా గడపాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సుంకరి శ్రీనివాస్ సునీత దంపతులను శాలువాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో టిఎమ్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధామస్ రెడ్డి, డిప్యూటీ ఆర్ ఎమ్ శివ శంకర్, ఉద్యోగ సంఘాల నాయకులు లక్ష్మయ్య, బత్తుల సుధాకర్, బెల్లి నర్సయ్య, ఎన్ సి హెచ్ సైదులు, ఏకాంబరం, పూర్ణ శశికాంత్, అడ్వకేట్ అయోధ్య, పిఆర్ టియు నాయకులు వెంకటరెడ్డి, సుంకరి రాజారాం తదితరులు పాల్గొన్నారు.