ఆయోధ్య  రామాలయంలో జరిగే 'సూర్య తిలకం' ఘట్టం వెనుక ఉన్నది

భౌతిక శాస్త్ర నియమాలే (సైన్స్ సూత్రాలే)...

Apr 18, 2024 - 19:05
 0  2
ఆయోధ్య  రామాలయంలో జరిగే 'సూర్య తిలకం' ఘట్టం వెనుక ఉన్నది

ఆసక్తి కలిగించే ఈ సంఘటన వెనుక ఉన్న శాస్త్రం (సైన్స్ ) నిజానికి చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ భౌతిక శాస్త్ర నియమాలు (సైన్స్ సూత్రాలు) ఏడవ తరగతి పిల్లలకు కూడా పరిచయమున్నవే.

ఐఐటి రూర్కీ నుండి 10 మంది భారతీయ శాస్త్రవేత్తల బృందం దీని సాకారానికి కృషి చేశారు. శ్రీరామ నవమి నాడు, అత్యాధునిక శాస్త్రీయ నైపుణ్యాన్ని (Scientific  skill) ఉపయోగించి, 5.8 సెంటీమీటర్ల కాంతి కిరణం బాలరాముడి విగ్రహం నుదుట ప్రకాశించేలా చేసారు. దీన్నే "సూర్య తిలక్" అని పిలుస్తున్నారు.

ఇది ఎలా పనిచేస్తుందంటే నాలుగు దర్పణాలు మరియు నాలుగు లెన్సులు ఒక ఆప్టో మెకానికల్ వ్యవస్థలో మూడవ అంతస్తు నుండి గర్భ గుడిలోని బాలరాముని విగ్రహం యొక్క నుదుటిపై సూర్యకాంతిని ప్రసరింప చేసేలా అమర్చబడి ఉంటాయి. 

ఈ సూర్యతిలక్ ఘట్టం ప్రతి సంవత్సరం రామ నవమి నాడు మధ్యాహ్నం 12 గంటలకు పునరావృతం అయ్యేలా చేసారు. ఇందుకోసం శాస్త్రవేత్తలు కింద పటంలో చూపిన విధంగా.. ఆలయం మూడవ అంతస్తు నుంచి కింద వరకు దర్పణాలను, లెన్స్ లను ఇత్తడి గొట్టాలలో బిగించి పెరిస్కోప్ వంటి పరికరాన్ని తయారు చేసి అమర్చారు.
ఈ దర్పణాలు మరియు లెన్సులు ఆలయ శిఖరం దగ్గర మూడవ అంతస్తు నుండి సూర్య కిరణాలను గర్భగుడికి తీసుకురావడానికి ఏర్పాటు చేయబడ్డాయి. ఇందులో సూర్య కిరణాలను పరావర్తనం  చెందిందే సైన్స్ సూత్రాలు ఉపయోగించ బడ్డాయి.

ఈ నిర్మాణంలో, సూర్యుని మార్గం గురించి సాంకేతిక సహాయాన్ని బెంగుళూరులోని IIA indian institute of astrophysics సంస్థ (ఐఐఎ) నుండి తీసుకున్నారు. బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ అయిన టికా లెన్సులు మరియు గొట్టాలను తయారు చేసింది.

శ్రీ రామ నవమి తేదీని చాంద్రమానం ప్రకారం రాయబడిన పంచాంగం ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ సంఘటన ప్రతీ సంవత్సరం షెడ్యూల్ ప్రకారం జరగాలని నిర్ధారించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

భారత దేశంలోని ఖగోళ శాస్త్ర రంగంలో ప్రముఖ సంస్థ అయిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఎ), బెంగళూరు, చంద్రమాన మరియు సౌరమాన క్యాలెండర్ల మధ్య ఉండే తేడా కారణంగా వచ్చే సమస్యను పరిష్కరించింది.

ఐఐఎ కు ఈ విషయంలో నైపుణ్యం ఉంది. భారత దేశంలోని కొన్ని ఉత్తమ టెలిస్కోలను రూపొందించిన సంస్థ ఇది. పెరిస్కోప్ వంటి పరికరం ద్వారా రామాలయ గర్భగుడిలోకి సూర్యకాంతిని తీసుకురావడానికి ఉపయోగించారు, శాస్త్రవేత్తలు.

భారత దేశంలోని కొన్ని ప్రాచీన జైన, బౌద్ధు దేవాలయాలు మరియు హిందూ దేవాలయాలలో కూడా ఈ సాంకేతికత ఉపయోగించ బడింది. అయితే ఈ సూర్య తిలక్ ఘట్టం సాకారం చేయడానికి మన శాస్త్రవేత్తలు ఆధునిక టెక్నాలజీ నా వాడారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333