ప్రారంభమైన ఎంపీ నామినేషన్ల పర్వం
నామినేషన్ల స్వీకరణకు అంతా సిద్ధం
రైటప్ : నామినేషన్లు దాఖలు చేస్తున్న బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్
తెలంగాణ వార్త, ఏప్రిల్ 18 : పార్లమెంట్ ఎన్నికల పోరు ఇక జోరందుకోనుంది. పార్లమెంట్ ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతోంది. వచ్చే నెల 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో నామినేషన్ల పర్వానికి తెరలేచింది. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారం నుంచి ప్రారంభమయింది. ఈ పార్లమెంట్ స్థానాలకు నామినేషన్ల స్వీకరణలో భాగంగా జిల్లాలో (8 )మంది అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పార్లమెంట్ స్థానానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈటెల జమున నామినేషన్, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పాలది పవన్ కుమార్ నామినేషన్, ఇండిపెండెంట్ అభ్యర్థిగా బేగరి లోకేష్ నామినేషన్, అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థిగా మేడే సత్యం, ఇండిపెంట్ అభ్యర్థిగా చిలకా చంద్రశేఖర్, ఇండిపెండెంట్ అభ్యర్థిగా మలోటు శంకర్, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పెసరికాయల పరీక్షిత్తు రెడ్డి రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా, వెరసి మొత్తం 9 నామినేషన్లు దాఖలు చేయడం జరిగిందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు.