ఆయిల్ పామ్ సాగు పై అవగాహన కలిగివుండాలి.....జిల్లా ఉద్యాన అధికారి నాగయ్య

Apr 27, 2024 - 16:21
 0  1
ఆయిల్ పామ్ సాగు పై అవగాహన కలిగివుండాలి.....జిల్లా ఉద్యాన అధికారి నాగయ్య

మునగాల 27 ఏప్రిల్ 2024

తెలంగాణ వార్తా ప్రతినిధి:-

 క్షత్ర స్థాయి సిబ్బంది ఆయిల్ ఫామ్ సాగు పైన అవగాహనా కలిగి ఉండి తదుపరి రైతులకు సూచనలు, సలహాలు అందించాలని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి తీగల నాగయ్య అన్నారు. మండల పరిధిలో నీ మాధవరం నర్సీరి లో అయిల్ ఫామ్ సాగు పైన క్షేత్ర స్థాయి సిబ్బంది కి అవగాహనా సదస్సు ను నిర్వహించారు ఈ కార్యక్రమం లో ఆయన పాలుగొని మాట్లాడారు. ప్రభుత్వం 2024-25 సంవత్సరం లో జిల్లాకు విధించిన సాగు లక్ష్యం సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ కోరారు. జిల్లలో నీటివసతి ఉన్నా రైతులను గుర్తించి అట్టి రైతులు ఆయిల్ ఫామ్ పంట సాగు చేసుకునేలా చూడాలన్నారు. వరి పంటకు ప్రత్యామ్నాయం గా ఆయిల్ ఫామ్ సాగుచేసి అధిక ఆదాయం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ప్రాంతీయ ఉద్యాన అధికారి కన్న జగన్,పతంజలి ఆయిల్ ఫామ్ కంపెనీ జిల్లా మేనేజర్ జె హరీష్, జూనియర్ మేనేజర్ వి శశి కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ లు పి అశోక్, సాయి కుమార్, స్రవంతి, అకౌంటెంట్ వినాయక,క్షేత్ర సహాయకులు రంగు ముత్యంరాజు, భద్రాచలం, సుధాకర్ రెడ్డి, లక్ష్మణ్,నరేష్, సైదిరెడ్డి, రమేష్, నాగరాజ్, తో పాటు పలువురు క్షేత్ర స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State