ప్రజావాణి తేదీ మార్పు ప్రజలు గమనించ ప్రార్థన.
తెలంగాణ ప్రభుత్వం ప్రజల అర్జీలను స్వీకరించేందుకుప్రతీ మంగళవారం మరియు శుక్రవారం మహాత్మ జ్యోతిబా ఫూలే ప్రజాభవన్, బేగంపేట, హైదరాబాద్ నందు రాష్ట్ర స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
16వ కేంద్ర ఆర్థిక సంఘంతో మహాత్మ జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో నిర్వహించబడే ముఖ్యమైన సమావేశాల కారణంగా, తేది 10.09.2024 మంగళవారం రోజున నిర్వహించబడే ప్రజావాణి కార్యక్రమం, తేది 11.09.2024 బుధవారానికి వాయిదా వేయబడింది.
ఈ సందర్భంగా, అర్జీదారులందరు ఈ మార్పును గమనించి, తేది 10.09.2024 మంగళవారంకు బదులుగా తేది11.09.2024 బుధవారం నాడు ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు.