**చెరువు మట్టి అక్రమ రవాణా""నందిగామ మండలం సోమవారం చెరువు*

Jun 15, 2025 - 19:39
 0  14
**చెరువు మట్టి అక్రమ రవాణా""నందిగామ మండలం సోమవారం చెరువు*

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి నందిగామ : *చెరువు మట్టి అక్రమ రవాణా*

 *అంతా మా ఇష్టం ➖ మమ్మల్ని ఎవరు ఆపేది*

 ట్రాక్టర్ మట్టి రూ "1500

నందిగామ మండల పరిధిలోని సోమవారం చెరువు నుంచి అక్రమంగా మట్టిని అక్రమంగా ప్రోక్లైన్ పెట్టి తరలిస్తున్న ట్రాక్టర్లను

చెరువు మట్టి అక్రమ రవాణా ఆపేదెవరో చూద్దాం.... అంటున్నారు మాఫియా

ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ కోట్లాది రూపాయల మట్టిని అక్రమంగా మట్టి మాఫియా తరలిస్తున్న మామూళ్ల మత్తులో అధికారులు చర్యలు తీసుకోవడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. 

గోరంత అనుమతి పొంది కొండంత తవ్వకాలు జరుపుతున్న చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు 

ప్రజాప్రతినిధుల తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. నందిగామ మండల పరిధిలోని సోమవారం గ్రామ చెరువు నుండి గత నెలలుగా చెరువు మట్టి తరలింపుకు కొందరు వ్యాపారులు అనుమతి తీసుకున్నామని చెప్పి ఎలాంటి అనుమతి లేకుండా ఓ గ్రామ నాయకుడు వేలాది ట్రాక్టర్ల ట్రిప్పులు తోలి జేబులు నింపుకుంటుంటే అధికారుల కండ్లకు మాత్రం కానరావడం లేదు.

ప్రతిరోజు పగలు, రాత్రి తేడా లేకుండా చెరువు మట్టిని వేలాది ట్రిప్పుల ట్రాక్టర్లు తరలించినట్లు స్థానికుల ఆరోపిస్తున్నారు. 

దీని పట్ల పట్ల అధికారుల నిర్లక్ష్యం అర్థమవుతుంది.

ఇరిగేషన్ అధికారుల తీరు ఎలా ఉంది అంటే మాకు మామూలు ముడితే చాలు ఎన్ని ట్రిప్పులైనా ఎంతైనా ఎప్పుడైనా తరలించుకోవచ్చు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అధికారులు చెరువుల వైపు కన్నెత్తి చూడడం లేదు మట్టి మాఫియా ఏది చెపితే వాటికే అధికారులు తలాడిస్తున్నట్టు తెలుస్తుంది. మట్టి మాఫియా కనుసైగల్లో ఇరిగేషన్ అధికారులు నడుచుకుంటుంటే ఉన్నతాధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. చెరువులో మట్టి తరలింపు పారదర్శకంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించిన మార్గదర్శకాలను

తుంగలో తొక్కుతూ మట్టి మాఫియా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. చర్యలు తీసుకోవలసిన మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడం వారికి ఎంత మేరకు మామూలు ముట్టాయో తెలిపేందుకు నిదర్శనం అంటున్నారు ప్రజలు.

ఇకనైనా అధికారులు నిద్రలేచి మట్టి మాఫియా పై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State