ఆనాధలకు చార్లెట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆపన్న హస్తం
జాటోత్ డేవిడ్ రాజు

చార్లెట్ హోం సూర్యాపేట వ్యవస్థాపక అధ్యక్షులు
నూతనకల్ 12 గురువారం : స్థానిక మండల కేంద్రం లోని చిల్పకుంట్ల గ్రామం లో ఇటీవల కాలంలో పంతం పరశురాము సుభద్ర ఆకాల మరణ వార్త సోషల్ మీడియా ద్వారా విని వాళ్ళ యొక్క స్థితి గతులు చూసి హృదయం కలిచివేశిందని చిన్న తనంలో నే తండ్రి పంతం పరశురాములు ఏడు సంవత్సరం క్రితం కోల్పోయినా బాధ నుండి కోలుకోక ముందే ఇటీవల తల్లి పంతం సుభద్ర కామెర్లు, విపరీత జ్వరం తో వైద్యం చేయించుకొనే స్థోమత లేక మరణించడం చాలా బాధాకరం అనీ వారికీ ఇద్దరు కుమారులు పంతం సవీన్ (15), పంతం మహేష్(8) కుమార్తె పంతం శ్రావణి (13) ఆనాధలుగా మిగిలిపోయారని, ఇప్పటి వరకు వారికీ సొంత జాగా, ఇల్లు లేకపోవడం తో ముగ్గురు సొంత ఇల్లు లేక చదువు కునే స్థోమత లేక తీవ్ర ఇబ్బందులు పడటంతో సి. డబ్ల్యూ. సి, ఐ. సి. డి. యస్ కమిటీలు పర్మిషన్ ఇస్తే పిల్లలను చదివించడానికి మేము ముందుకు వస్తాము అనీ తెలియపర్చినారు. అనంతరం చార్లెట్ చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు జాటోత్ డేవిడ్ రాజు, ప్రధాన కార్యదర్శి జాటోత్ శేఖర్ వారి కుటుంబనికి నెలకు సరిపోను నిత్యావసర సరుకులు,పిల్లలకు బట్టలు, దుప్పట్లు పంపిణి చేశారు. ఇప్పటి వరకు వారి పెద్ద నాన్న పంతం నగేష్ సునీత దంపతులు కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయం అనీ అన్నారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చే రెండు సార్లు సామాజిక సేవా అవార్డు గ్రహీత దుర్గం ప్రభాకర్, బోనగిరి లింగయ్య, నకిరేకంటి సైమన్, పిట్టల సామెల్, అమ్మమ్మ గుండెల్లి సర్వమ్మ, పంతం యాకయ్య, బొజ్జ వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు