సంచలనం కలిగించిన కూసుమంచి తెలంగాణ వార్త కథనాలు

Aug 28, 2024 - 10:52
 0  137
సంచలనం కలిగించిన కూసుమంచి తెలంగాణ వార్త కథనాలు

సెలవురోజుల్లోనూ "భూ" దందానకిలీ పట్టాపై జిల్లా స్థాయి అధికారుల ఆరా...?
కనుచూపు మేరలో భూమి లేకపోయినా... రెండెకరాల 11 కుంటలకు పట్టా పొందటంపై... "గరం గరం"...?
*అసలు ఎస్సారెస్పీ అవార్డు రిపోర్టు పట్టించుకోకుండా... ఎలా పట్టా ఇచ్చారని"రెవిన్యూ శాఖ మల్ల గుల్లలు...?
*గత నాలుగేళ్లుగా సమస్య నలుగుతున్న ఉదాసీనత ఎలా...?
*రెవిన్యూ సహకార చట్టం ప్రకారం చర్యలకు రెవెన్యూ దిద్దుబాటు చర్యలు ...?
*పట్టా ఇచ్చిన వారిని వదిలి... పట్టా పొందిన వ్యక్తిపై చర్యలకు రంగం సిద్ధం...?
*ఆత్మరక్షణలో రెవెన్యూ శాఖ...?
*లోతైన విషయాలను చేసి.. మండల వ్యాప్తంగా నకిలీలను కూకటీ వేళ్ళతో.. కదిలిస్తారా...?
*ఖమ్మం _కుసుమంచి రోడ్డును కూడా పట్టా చేశారా...? -అంటున్న కూసుమంచి పరిసర గ్రామాల ప్రజలు...?

వివాదాస్పద భూమిలో చేపల సాగు...? రుణాలు పొందిన గాని అధికారులు చర్యలకు భయపడ్డారా లేక...?
*ఇంతకీ రెండు ఎకరాల 11 కుంటల భూమిని
* ఎక్కడినుండి సర్దుబాటు చేస్తారు...? ఎస్సారెస్పీ కాలవనుండా...?లేక ఖమ్మం -కుసుమంచి ఆర్ అండ్ బి రోడ్డు...?
*రెవెన్యూ అధికారులు నిలదీస్తున్న రైతాంగం...?

తెలంగాణ వార్త...సంచలన కథనం..3 తెలంగాణ వార్త ప్రతినిధి : ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో/ఆగస్టు 28
కూసుమంచి మండలంలో ఎటువంటి భూమి లేకపోయినా సర్వే నెంబర్లు భూమి ఉన్నట్లు రికార్డులను తారు మార్చేసి ఎస్సారెస్పీ ప్రభుత్వ కాలువకు భూమి సేకరించి సర్వేలు చేసినష్టపరిహారం చెల్లించి కాలువను తవ్వారు. భూమి కోల్పోయిన రైతులకు ప్యాకేజీని అందించినట్లుగా ఎస్సారెస్పీ అవార్డు ద్వారా చెల్లింపులు జరిగాయి. కాలువ సేకరణకు పోయిన మరియు మిగిలిన భూమి వివరాలను ఎస్సారెస్పీ కాలువ నివేదికలో పొందుపరిచారు. కానీ అవినీతికి అలవాటు పడిన అవినీతి రెవెన్యూ అధికారుల తీరు వలన ఆ సర్వే నెంబర్లు ముగ్గురు మాత్రమే భూమిని కలిగి ఉన్నట్లు స్పష్టంగా రికార్డులు స్పష్టం చేస్తున్న గాని ఏకంగా ఓ వ్యక్తికి రెండు ఎకరాల 11 కుంటలు కట్టబెట్టడం వెనుక ఓ కార్యదర్శి తో పాటు మండల రెవెన్యూ అధికారి హస్తం ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండల స్థాయి తాహసిల్దార్ తో పాటు డిప్యూటీ తాహసిల్దార్ ఆర్ ఐ కార్యదర్శి కృషి ఉన్నట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తికి భూమిని కట్టబెట్టారు సరే.. కానీ పరిసర రైతుల పరిస్థితిని అర్థం చేసుకోని అధికారులు ఉద్యోగ బాధ్యతలనుండి బదిలీ అయి వెళ్లిపోయారు. సమస్య జటిలంగా మారి గత నాలుగు సంవత్సరాల నుండి వివాదాలను రాజేసి కాసులకు కక్కుర్తి పడి ఇష్టానుసారంగా వ్యవహరించారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. నకిలీ పట్టా పొందిన వ్యక్తి కి మిగిలిన భూమి కూడా నష్టపరిహారం అందించినట్లు ఎస్సారెస్పీ రికార్డు స్పష్టం చేస్తోంది. కానీ అవినీతి అలవాటుపడిన అధికారులు అవేం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరించి బాధ్యతలను విస్మరించారని పలువురు రైతులతో పాటు బాధితులు ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నకిలీ పట్టా పొందిన వ్యక్తి దర్జాగా ప్రభుత్వ రాయితీలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందటం విశేషం. పలుమార్లు బాధిత కుటుంబం జిల్లా కలెక్టర్ ఆర్డిఓ రెవిన్యూ కార్యాలయాలు చుట్టూ తిరుగుతూ మీ సేవలో సర్వే కోసం రెండు సంవత్సరాలుగా దరఖాస్తులు చేసినా గాని ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోకపోవడం నకిలీ పట్టా పొందిన వ్యక్తికి ఉన్న పలుకుబడిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు నాని పలువురు బాధిత రైతులుఆరోపిస్తున్నారు.

*పదిహేనేళ్లు కౌవులు కు.. చేపల చెరువు నిర్మించి... నాటు కోళ్లు... మాంసం ముడుపులతో దర్జాగా పట్టా పొందినట్లు బాధి త కుటుంబంతో పాటు పరిసర పొలాల రైతులు సైతం ఆరోపించటం అధికారుల పనితీరును తేట తెల్లం చేస్తోంది. కౌవులుకు తీసుకున్న సమయంలో కూడా చేపలు సాగుతో పాటు, వరి పంటను సాగు చేసి పరిసర పొలాల రైతులను సైతం వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తమ కుటుంబ సభ్యుల పొలాల వ్యవహారాలలో తలదూర్చి పంచాయతీలు రాజేసినట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి. అన్నీ తెలిసినప్పటికీ అధికారులు ఏమీ తెలవనట్లుగా వ్యవహరించారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇటీవల సర్వే కొచ్చిన సర్వే అధికారులు బాధితులు పొలం వద్ద సర్వే కోసం రాగా పొలం వద్దనే రైతులకు నోటీసులు అందించిన దుస్థితి. కానీ నకిలీ పట్టా పొందిన వ్యక్తి ఒక రోజు ముందే మండల తాహసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ తో పాటు ఆర్ఐ సర్వేయర్ తో మంతనాలు సాగించినట్లు సాక్షాత్తు సర్వేయర్ సైతంరైతుల వద్ద బహిరంగంగా వ్యాఖ్యానించడం తెలిసిందే. ఈ తతంగాన్ని జననేత్రం నిఘా  కెమెరాలో చిక్కాయి. ఈ విషయంపై జననేత్రం ప్రతినిధి సర్వేయర్ నువివరాలు కోరగా మంతనాలు జరిపిన మాట వాస్తవమేనని. సోమవారం సర్వే కు రావాలని బాధిత రైతులకు తెలపటం కొస మెరుపు. దీంతో ఆగ్రహించిన రైతులు  ఇక్కడ ఈ సర్వే నెంబర్లో పొలం ఎక్కడుందో చూపించాలని సర్వేయ ర్ ను నిలదీశారు. దీంతో మండల సర్వే సిబ్బంది అతనికి నోటీసులు ఇస్తాం.. ఆధారాలు తీసుకొని రావాలని చెప్తాం అంటూ అక్కడ నుండి వెళ్లిపోయారు. కాగా జననేత్రం వరుసకథనాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ స్పందన వచ్చింది. సెలవు రోజులు కావడంతో వార్త కథనాలు సోషల్ మీడియా లో గ్రూపుల్లో హల్ చల్ చేశాయి. దీంతో జిల్లాస్థాయి రెవెన్యూ అధికారులు సైతం ఆరా తీసినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తోంది. ఆ సర్వే నెంబర్లు లో మిగులు భూమి లేకపోవడం భూమి ఉన్నట్లుగా రెవిన్యూ అధికారులు ఓ వ్యక్తికి పట్టా కట్టబెట్టడం సంచలనం కాగా రెండెకరాల 11 కుంటల భూమిని ఎక్కడ చూపిస్తారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో తమకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నదని తక్షణమే మంజూరు చేసిన పట్టాను రద్దు చేయాలని కోరుతున్నారు. కాగా  రెవిన్యూ చట్టాల ప్రకారం నకిలీ పట్టా పొందిన వ్యక్తిపై చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం అందుతోంది. ఓ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు ప్రకారం మండల తాహసిల్దార్ 8 వారాలలో నివేదిక అందజేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందుతూ తప్పుడు ధృవీకరణలు జత చేసి ప్రభుత్వాన్ని రెవెన్యూ వ్యవస్థను తప్పుదారి పట్టించిన వ్యక్తిపై సహకరించిన రెవెన్యూ శాఖపై లోతుగా విచారణ చేసి నిజ నిర్ధారణచేయాలని బాధిత కుటుంబంతో పాటు పరిసర రైతులు జిల్లా కలెక్టర్లను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333