రెండు తెలుగు రాష్ట్రాల్లో నకిలీ విత్తనాలతో,కల్తీ విత్తనాలతో జాగ్రత్తగా ఉండండి- యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి గుజ్జుల

రైతులు ఈ దేశానికి వెన్నుముక్క లాంటి వారు,మనం తినే ఆహారాన్ని కల్తీ నివారణ చేయడానికి మన దేశా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మన పిల్లల భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు ఎదురుకాకుండా చూడాలంటే... ఈ నకిలీ విత్తనాలు మరియు కల్తీ ను నివారించాలి అని చెప్పేరు. నకిలీ విత్తనాల అమ్మకం మీ దృష్టికి వస్తే పోలీసులకు సమాచారమివ్వండి. ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఎట్టిపరిస్థితుల్లోనూ విడి విత్తనాలు కొనకుండ నియంత్రించండి. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వలను యువతరం పార్టీ కోరింది.. ప్రతి ఏటా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని గుర్తుచేశారు, ఈ ఏడాది అలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వలను యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి గుజ్జుల కోరేరు