ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమార్ కి వినతి పత్రం ఇచ్చిన
జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ నాయకులు.
జోగులాంబ గద్వాల 15 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. గత ప్రభుత్వంలో జోగులాంబ గద్వాల్ జిల్లాలో కలెక్టర్గా పని చేసినటువంటి వల్లూరు క్రాంతి యొక్క అవినీతి అక్రమాల విషయం గురించి గత ప్రభుత్వంలో జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహించినటువంటి వల్లూరు క్రాంతి గత ప్రభుత్వ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పనిచేస్తూ అవినీతి అక్రమాలకు అడ్డగా కలెక్టర్ అధికారాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది. రైతు భూముల రికార్డులకు కి సంబంధించిన జిల్లాలోని వివిధ మండలాల్లో పేద రైతుల భూములు రికార్డులను సరైన పద్ధతిలో ఉన్నా వాటికి మరియు లేని వాటిని రికార్డు సరి చేయడానికి తన తండ్రిగారైన DR. వెంకట రంగారెడ్డి కర్నూలొ గ్యాస్ట్రో హాస్పిటల్ నడుపుతుంటారు వారి ద్వారా ఆర్థిక లావాదేవీలు చేస్తూ రికార్డులు అక్రమంగా రికార్డులు ఎక్కించి పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఆర్థికంగా లేని రైతులు డబ్బులు ఇవ్వలేని వారి సమస్యలు రికార్డులు సరి చేయకుండా ఇప్పటిదాకా పెండింగ్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఆమె చేసినటువంటి ఈ యొక్క అవినీతిని సరైన పద్ధతిలో విచారణ చేసి బాధ్యత రైతులకు న్యాయం చేయవలసిందిగా మనవి .వారు చేసిన అవినీతికి సంబంధించిన వివరాలు ఈ క్రింది వరుసలో ఉన్నాయి.
1) రాజోలి మండలం పెద్ద తాండ్రపాడు గ్రామంలో సర్వేనెంబర్ 156/. 39 ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ఈ భూమిని తొలగించడానికి ఫిబ్రవరి 2023 లో ఆర్థిక లావాదేవీలు వారి తండ్రి ద్వారా తీసుకోవడం జరిగింది.
2) అలంపూర్ మండల్ కోనేరు విలేజ్ నందు సర్వేనెంబర్ 10 లో వివాదంలో ఉన్న 10 ఎకరా పట్టా భూమినీ నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది .
3 ) గట్టు మండలం ఇందువాసి గ్రామంలో సర్వేనెంబర్ 45, 46 లో భూదాన్ బోర్డుకి సంబంధించిన 16 ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుండి తొలగించడం జరిగింది.
4) గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి కుచినెర్ల గ్రామంలో రికార్డు లేనటువంటి భూములను రికార్డ్ లొ ఉన్నట్టుగా అప్పటి ఆర్డిఓ రాములు మరియు వల్లూరు క్రాంతి కలిసి రికార్డులు ఉన్నట్టు చూయించి దాదాపు 400 ఎకరాలకు అక్రమంగా రైతుల పేరుతో డబ్బును దోచుకోవడం జరిగింది.
5) అల్లంపూర్ క్రాస్ రోడ్ పుల్లూరు విలేజ్ నందు సర్వేనెంబర్ 268 వివాదంలో ఉన్నటువంటి భూమిని మొదట రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తికి కాకుండా రెండో రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి వ్యక్తికి డిజిటల్ సిగ్నేచర్ చేసి వారికి అక్రమంగా రికార్డును ఎక్కించడం జరిగింది.
6) ఇటిక్యాల మండలం శాసనూలు విలేజ్ సర్వేనెంబర్ 5 /6 /నందు 0/20 గుంటల వర్క్ బోర్డ్ భూమిని నిషేధిత జాబితా నుండి తొలగించి ప్రైవేటు వ్యక్తులకు అక్రమంగా రికార్డు ఎక్కించడం జరిగింది.
7) అల్లంపూర్ ఎక్స్ రోడ్ ఉండవెల్లి మండలం పుల్లూరు విలేజ్ సర్వేనెంబర్ 256 నందు 6 ఎకరాల సీలింగ్ అసైన్డ్ భూమిని నిషేధిత జాబితా నుండి తొలగించి ప్రైవేట్ వ్యక్తులకు పట్టా చేయడం జరిగింది .
8) అల్లంపూర్ ఎక్స్ రోడ్డు నందు భూదాన్ బోర్డుకి సంబంధించిన మరియ వాక్కు బోర్డుకి సంబంధించిన భూములను నిషేధిత జాబితా నుండి తొలగించి ప్రైవేటు వ్యక్తులకు పట్టాలు చేసి లక్షల కోట్ల రూపాయల ఆర్థిక లాభం పొందింది.
9) ఐజ మున్సిపాలిటీ కేంద్రంలో అక్రమంగా ఇంటి నిర్మాణం కోసం పరిమిషన్లు తీసుకొని 53 కమర్షియల్ సెటర్లు కట్టినటువంటి వ్యక్తులకు కోర్టు నుండి డిష్ మెటల్ ఆర్డర్ వచ్చి కూడా వాటిని రెసిడెన్షియల్ గా మార్చుకోవడానికి అప్పటి మంత్రి నిరంజన్ రెడ్డి ప్రోత్బలంతో మున్సిపాలిటీ చట్టానికి వ్యతిరేకంగా వాటిని రెసిడెన్షియల్ గా మార్చడానికి ఆర్థిక లావ్యాదేవిలు జరిగినట్టు తెలిసింది.
10) ఐజ మండలం బింగు దొడ్డి గ్రామంలో సర్వేనెంబర్ 62 నందు రోడ్డుకు పోయినటువంటి భూమిని కూడా రికార్డుల్లో లో కట్ చేయకుండా మిగులు భూమిని రికార్డు చేసి పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది
ఈ పై జరిగిన లావాదేవీలకు వారి తండ్రిగారైన డాక్టర్ వెంకట్రామిరెడ్డి కర్నూలు ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు ఆరోపణలు చాలా వస్తున్నందున వీరిపై గతంలో చేసినటువంటి అవినీతిని సరైన పద్ధతిలో విచారణ చేసి నిజ నిర్ధారణ చేయవలసిందిగా తెలియజేసుకుంటున్నాం .
CS కు ఫిర్యాదు చేసిన వారిలో...
1) తనగల సీతారామిరెడ్డి ఆర్డీఎస్ మాజీ చైర్మన్,
2) మాస్టర్ షేక్ సావళి ఆచారి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఐజ మున్సిపల్ కౌన్సిలర్,
3) గంజిపేట శంకర్ మాజీ వైస్ చైర్మన్ ప్రజెంట్ గద్వాల్ మున్సిపల్ కౌన్సిలర్.
4) బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గౌస్ బాయ్
5) గట్టు మండల పార్టీ అధ్యక్షుడు వారు ఉన్నారు.