అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి

సిపిఐ జిల్లా సభ్యులు శాంతి కుమార్

Nov 20, 2024 - 13:40
 0  35
అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి

అడ్డగూడూరు 20 నవంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని మానాయకుంట గ్రామంలో బుధవారం రోజు సిపిఐ జిల్లా సమితి సభ్యులు శాంతి కుమార్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు సీపీఐ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సిపిఐ అడ్డగూడూరు మండల కార్యదర్శి రేఖల శ్రీనివాస్ మాట్లాడుతూ..భారతదేశంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సిపిఐ పార్టీ చేస్తున్న ఉద్యమాలను బలపరిచి పార్టీలో చేరిన నాయకులకు విప్లవ అభినందనలు తెలిపారు. అనంతరం ఎడ్ల వెంకటయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ మండలంలో వడ్లు మరియు పత్తి కొనుగోలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు రైతులకు చెందిన పత్తి,వడ్లు తూకం మరియు తేమ పేరుతో  ఆలస్యం చేయకుండా ఐకెపి సెంటర్లలో రోజువారీగా వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని అదేవిధంగా మండలంలో ఉన్న సీసీఐ కొనుగోలు కేంద్రాలలో పత్తి కొనుగోలు వేగవంతం చేయాలని అన్నారు.మండలంలోని బొడ్డుగూడెం గ్రామంలో వ్యవసాయ బావుల వద్ద ట్రాన్స్ఫార్మర్లను దొంగలిస్తున్న దొంగలను పోలీస్ శాఖ వారు కనిపెట్టాలని ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మండల వ్యాప్తంగా ఉన్న అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సి హెచ్ ఆవిలమల్లు , టీ సైదులు, సుందరయ్య శ్రీను తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333