ఘనంగా అంతర్జాతీయ బాలల దినోత్సవం శాంతినగర్ జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల లో
జోగులాంబ గద్వాల 20 నవంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:-వడ్డపల్లి నేడు వడ్డేపల్లి మండల మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎం.వి ఫౌండేషన్ మరియు పాఠశాల హెచ్ఎం ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా పురపాలక లో ర్యాలీ చేశారు అనంతరం పాఠశాలలో వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంకు ముఖ్య అతిథిగా శాంతినగర్ సిఐ టాటా బాబు హాజరై పిల్లలకు శుభాకాంక్షలు తెలిపి వారికి ఉన్నత చదువులు, బాల్యవివహాలు,చట్టాలు,షోషల్ మీడియా,మొబైల్ వాడకం మొదలగు అంశాలపై వారికి అవగాహన కల్పించారు. అలాగే పురపాలక కమిషనర్ రాజయ్య మాట్లాడుతూ విద్యార్థులకు మంచి భవిష్యత్ ప్రణాళిక ఏర్పాటు చేసుకొని చదవాలని,చేడు వేసనాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ఎంఈఓ నర్సింహ మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పిన ప్రకారంగా చదువుకుంటే ముందు భవిష్యత్ లో సొంత నిర్ణయాలు తీసుకొని మంచిస్థాయిలోఉంటారన్నారు.కార్యక్రమంలో: జిహెచ్ఎం వెంకటేశ్వర రావు, ఎంబి ఫౌండేషన్ మండల కోఆర్డినేటర్ హానిమిరెడ్డి, సి ఆర్ పి ఎఫ్ సభ్యులునర్సింహులు,సుధాకర్,రైటర్డ్ ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం రామ్మోహన్, ఉపాధ్యాయ బృందం తదితరులు ఉన్నారు