గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థినులకు ముగ్గుల పోటీలు
జోగులాంబ గద్వాల 19 నవంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో విద్యార్థినులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి గంట కవితాదేవి జడ్పీ కాంతమ్మ, ఉమాదేవి, మరియు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు ముఖ్య అతిథిలు హాజరయ్యారు. విద్యార్థినులు వేసిన ముగ్గుల ప్రాముఖ్యతను జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి గంట కవితాదేవి,అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె గ్రంథాలయాల ప్రాముఖ్యతపై విద్యార్థినులకు వివరించారు. గ్రంథ పఠనాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ లు,, వివిధ పాఠశాలల విద్యార్థినులు పాల్గొన్నారు