రమణ గుట్టలో ప్లాట్ల ఆక్రమణ : అక్రమంగా నిర్మాణాలు 

Jul 31, 2024 - 20:26
 0  2
రమణ గుట్టలో ప్లాట్ల ఆక్రమణ : అక్రమంగా నిర్మాణాలు 

* రెవిన్యూ పోలీసులు  జిల్లా కలెక్టర్ లకూ ఫిర్యాదు 
* లభించని న్యాయం : పెరుగుతున్న కబ్జాదారుల ఆగడాలు
 * వ్యవస్థలపై నమ్మకం సడలు తోంది 
 *      బాధితుల ఆవేదన 
ఖమ్మం జూలై 29 :  ప్రభుత్వం రజబ్ అలీ నగర్ లోని రమణ గుట్ట ప్రాంతంలో 2024 లో ఇచ్చిన మా ప్లాట్ల లో కొంతమంది వ్యక్తులు  దౌర్జన్యంగా చొరబడి , ఇల్లు కట్టుకోవడానికి నిర్మించిన పిల్లర్లు, బేస్ మటం లను ప్రోక్లెన్ల తో ధ్వంసం చేసి, అక్రమంగా ఇంటి నిర్మాణాలను ప్రారంభించారని బాధితులు వల్ల బోయిన లక్ష్మీ కాంత , ఆడే పు తిరుపమ్మ భర్త వీరయ్య , కొండపల్లి సర్వయ్య పేర్కొన్నారు . సోమవారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజాసంఘాల ఐక్యవేదిక కార్యాలయంలో బాధితులు మాట్లాడారు. ఈ విషయంపై రెవెన్యూ అధి కారులైన ఎమ్మార్వో ఆర్డీవో , పోలీస్ అధి కారు లైనా సీఐ , పోలీస్ కమిషనర్ తోపాటు జిల్లా కలెక్టర్ సైతం ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇప్పటివరకు తమకు న్యాయం జరగలేదని , మరోవైపు తమ ప్లాట్లను కబ్జాలు చేసిన కబ్జా దారుల ఆగడాలు రోజురోజుకు శృతి మించి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతమంది అధికారుల చుట్టూ తిరుగు తున్నపటికి కనుచూపులో న్యాయం జరిగే సూచనలు కనిపించక పోవడంతో  తమ బాధను మీడియా ముందు వెళ్లగకు తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్లాట్లు సర్వే నెంబరు 64లో ఉండగా  కొరివి దయానంద్ కొరివి నవ్య కొరివి భాస్కర్ కొరవి ప్రేమ్ సుతారి నాగరాజు మొత్తం 10 మంది వ్యక్తులు ఇది 64 సర్వేనెంబర్ కాదు ఇది 60 సర్వే నెంబరు ఇది ప్రైవేటు ల్యాండ్ అంటూ మమ్ము లను బెదిరిస్తూ, మా ప్లాట్లను వారు ఆక్రమించు కున్నారని ఆరోపించారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో వీరి పేరు మీద ఫిర్యాదు చేశామని తెలిపారు. పోలీసు రెవెన్యూ అధికారులతో పాటు ఇతర సంబంధిత అధికారులకు కూడా తాము ఫిర్యాదు చేశామని బాధితులు ఆడేపు తిరుప్పమ్మ  భర్త  వీరయ్య , వల్ల బోయిన లక్ష్మి కాంత, కొండపల్లి సర్వయ్య తెలిపారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు తమ సమస్యపై దృష్టి సారించి , సదరు నిందితులను కఠినంగా శిక్షించి , మా ప్లాట్లను మాకు అప్పగించడం తోపాటు నిందితుల నుండి రక్షణ కల్పించాలని కోరారు. ఇవేమీ చేయని పక్షంలో తాము చేపట్టే అవాంఛనీయ  చర్యకు ఉన్నతాధి కారులతోపాటు నిందితులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రకటించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333