అయిజ పట్టణానికి త్వరలో నెరవేరనున్న *ప్రభుత్వ డిగ్రీ కళాశాల కళ 

May 11, 2024 - 19:37
 0  38
అయిజ పట్టణానికి త్వరలో నెరవేరనున్న *ప్రభుత్వ డిగ్రీ కళాశాల కళ 

జోగులాంబ గద్వాల 11 మే 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- అయిజ. పట్టణంలో గత పది సంవత్సరాలుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం అయిజ పట్టణము మరియు అయిజ మండల ప్రజలు అలుపెరుగని పోరాటం  చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. త్వరలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం& కాంగ్రెస్ పార్టీ ద్వారా అయిజ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అనే కల నెరవేరబోతుంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు అయినా ఈరోజు అయిజ పట్టణానికి జన జాతర భారీ ర్యాలీకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టివిక్రమార్క కి , మరియు కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి కి , ఏఐసిసి కార్యదర్శి మరియు ఆలంపూర్ మాజీ శాసనసభ్యులు ఎస్.ఏ.సంపత్ కుమార్ ఆధ్వర్యంలో అయిజ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాస్టర్ మధు కుమార్ *అయిజ పట్టణంలో విద్యా సౌకర్యాలు కల్పించుటలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కోసం వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన *తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు మల్లు భట్టి విక్రమార్క * స్పందిస్తూ అయిజ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మంజూరుకు ప్రత్యేక హామీ ఇవ్వడం జరిగింది . *అయిజ పట్టణ అధ్యక్షులు మాస్టర్ మధు కుమార్  *డిప్యూటీ సీఎంకు ఈ సందర్బంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వినతిపత్రం ఇచ్చిన వెంటనే స్పందించి అయిజ పట్టణానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు ప్రభుత్వ బాలికలజూనియర్ కళాశాల మంజూరుకు హామీ ఇచ్చినందుకు అయిజ పట్టణము మరియు అయిజ మండలంలో ఉన్న సుమారు  ఒక లక్ష పదివేల మంది ప్రజల తరఫున మరియు 70 వేల ఓటర్ల తరఫున  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు భట్టి విక్రమార్కకి మరియు సంపత్ కుమార్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333