క్షణికావేశాలతో నేరాలకు పాల్పడితే కఠినమైన జైలు శిక్షలు తప్పవు

సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరించారు.

May 7, 2026 - 13:37
May 7, 2026 - 13:38
 0  2
క్షణికావేశాలతో నేరాలకు పాల్పడితే కఠినమైన జైలు శిక్షలు తప్పవు
క్షణికావేశాలతో నేరాలకు పాల్పడితే కఠినమైన జైలు శిక్షలు తప్పవు

కోదాడ 07 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- కోదాడ పట్టణంలో బస్టాండ్ ఎదురుగా జరిగిన మహిళ హాత్యకు సంబంధించి ఘటన స్థలాన్ని ఈరోజు డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి స్థానిక ఇన్స్పెక్టర్ శివశంకర్ పోలీస్ అధికారులతో కలిసి ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు పరిశీలించారు. సంఘటన జరిగిన చోట దుకాణదారులను ఆరా తీశారు, సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, రిమాండ్ కు తరలించాలని తెలిపారు, జైలు శిక్ష పడేలా దర్యాప్తు చేసి సాక్షులను బాధితులను విచారించి నేరాభియోగ పత్రాలను కోర్టుకు దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ సమస్యలు ఉంటే సమరయస్యంగా పరిష్కరించుకోవాలని క్షణికావేశంతో తప్పులు చేసిన వివాదాలకు పాల్పడిన నేరాలు చేసిన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. చట్టాలు బలోపేతం చేయబడ్డాయని, కేసుల్లో సాంకేతికతతో వేగవంతమైన దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఈ సంఘటనకు సంబంధించి వేగంగా దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడేవారు ఎంతటి వారైనా పోలీస్ శాఖ ఉపేక్షించాలని చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఎస్పీ గారు వెంట స్థానిక డిఎస్పి శ్రీనివాసరెడ్డి, కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్ శివశంకర్, ఎస్సై సుధీర్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333