అన్ని హెల్త్ ప్రోగ్రాంలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత హెల్త్ సిబ్బందిదే:- ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జి రాజు
జోగులాంబ గద్వాల 18 నవంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. జిల్లా... జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సిద్ధప్ప ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం క్యాథూర్ నందు పీహెచ్సీ సిబ్బందికి మరియు ఏఎన్ఎంలకు ఆశా కార్యకర్తలకు ఎన్సిడి ప్రోగ్రాం మరియు టీబి , లెప్రసీ ప్రోగ్రాంపై సబ్వే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది .ఇట్టి మీటింగ్ నకు ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జి రాజు, జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్యాంసుందర్ సార్ పాల్గొని ఇన్సిడి ప్రోగ్రాం యందు Anm స్క్రీనింగ్ , నెలనెలా బీపి షుగర్ వారికి ఫాలోఅప్స్, ఆన్లైన్ ఆఫ్ లైన్, స్క్రీనింగ్ జరగాలని మిగిలిన మూడు నెలలలో ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంటు ఏర్పాటు చేయాలని ,మిగతా స్క్రీనింగ్ పూర్తి చేయాలని, జిల్లా ఆసుపత్రి నందు, ఎల్డర్లికేర్, పాలేటివ్ కేర్, ఎన్సిడి క్లినిక్, మెంటల్ హెల్త్, సంబంధించినవి ఉపయోగించుకోవాలని సందర్భంగా తెలిపారు, మరియు టీబి ప్రోగ్రాం యందు వివిధ గ్రామాలలో ఉన్న ప్రజలకు వారానికి మించిన దగ్గు ఉన్నట్లయితే ఆశా కార్యకర్తలు వారి యొక్క స్ఫుటం షాంపూల్స్ జిల్లాకు పంపాలని, నిర్ధారణ అయితే మందులు పంపిణీ చేయాలని, ఆశ కార్యకర్తలకు తెలిపారు అదేవిధంగా లేప్రోసి కేసులను గుర్తించాలని త్వరలో ఇంటింటి సర్వే నిర్వహించుకోవాలని తెలిపారు.. సమీక్ష సమావేశానికి మెడికల్ ఆఫీసర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.