వికలాంగుకు అంత్యోదయ రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి
భువనగిరి 22 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టుర్:- భువనగిరి జిల్లాలో ఉన్న వికలాంగులకు అంత్యోదయ రేషన్ కార్డ్స్,స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించాలని డిమాండ్ చేస్తు ఏప్రిల్ 25నుండి మే 14 వరకు జిల్లా వ్యాప్త క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని, మే 12-14 తేదీల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 48గంటల నిరాహార దీక్షలు చేస్తున్నామాని ఎన్ పి ఆర్ డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య, తెలిపారు.భువనగిరి పట్టణంలోని సుందరయ్య భవన్ లో ఎన్ పి ఆర్ డి భువనగిరి జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు సూరపంగా ప్రకాష్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్బంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య మాట్లాడుతూ.. జిల్లాలో 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం గుర్తించిన 21రకాల వైకల్యాల ప్రకారం సుమారు 30,000 మంది వికలాంగులున్నారు. కొత్త పెన్షన్స్ మంజూరు కాకపోవడం వలన వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.జిల్లాలో ఈ మధ్య కాలంలో వికలాంగులపై వేధింపులు, దాడులు పెరిగిపోతున్నవి.జిల్లాలో ఉన్న పరిశ్రమల సీ ఎస్ ఆర్ నిధుల ద్వారా వికలాంగుకు సహాయ పరికరాలు పంపిణి చేయడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రతి వికలాంగునికి అంత్యోదయ రేషన్ కార్డు మంజూరు చేయాలి.స్థలం ఉన్న వికలాంగులకు ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించి,2016 ఆర్పిడి చట్టం ప్రకారం 25 శాతం అదనంగా ఇవ్వాలి.2010 నుండి పెన్షన్ పొందుతూన్న ప్రతి వికలాంగునికి యుఐడి కార్డు పంపిణి చేయాలి. స్వయం ఉపాది కోసం దరఖాస్తూ చేసిన వారికి వెంటనే ఎలాంటి షరతులు లేకుండా రుణాలు ఇవ్వాలి.ఉపాధి హామీ పథకంలో వికలాంగులతో ప్రత్యేకంగా శ్రమ శక్తి సంఘాలను ఏర్పాటు చేసి, ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు జారీ చేసి 150 రోజులు పని కల్పించాలి సహాయ పరికరాల కోసం దరఖాస్తూ చేసిన వారికి వెంటనే పరికరాలు పంపిణి చేయాలి.మండల వికలాంగుల సమాఖ్యలను పునరుద్దరణ చేసి, గ్రామాలలో వికలాంగుల గ్రూప్స్ ఏర్పాటు చేయాలి.జిల్లా సమాఖ్యను వెంటనే ఏర్పాటు చేయాలి.మున్సిపాలిటీస్, మండల పరిషత్ ల పరిధిలో ఉన్న షాపింగ్ కంప్లెక్స్ లలో 5 శాతం షాప్స్ వికలాంగులకు కేటాయించాలి.జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ,బిసి,మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలో అమలవుతున్న స్వయం ఉపాధి రుణాలలో 5శాతం వికలాంగులకు కేటాయించాలి.జీవో నెంబర్ 1ప్రకారం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో 5శాతం వికలాంగులకు కేటాయించాలి.జిల్లా కేంద్రంలో వికలాంగుల కోసం ప్రత్యేకంగా 1000గజాల స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మించాలి.నిరుద్యోగ వికలాంగులకు స్వయం ఉపాధి కోసం శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి.రాజీవ్ యువ వికాసం పథకంలో వికలాంగుల మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.పెండింగ్ లో ఉన్న వివాహ ప్రోత్సాహకం వెంటనే మంజూరు చేయాలి.జిల్లా మండల,మున్సిపాలిటీ ల పరిధిలో ఉన్న ప్రభుత్వ , ప్రయివేట్ కార్యాలయాలు, సామూహిక ప్రాంతాలలో ర్యాంపులు నిర్మించాలి.2009 విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రయివేట్ విద్యాసంస్థల్లో వికలాంగులు,వారి పిల్లలకు ఉచితంగా సీట్లు కేటాయించాలి.
ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్షులు సూరపంగా ప్రకాష్, జిల్లా కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ..పోస్ట్ ఆఫీస్ ల ద్వారా పెన్షన్స్ పొందుతూన్న ఆసరా పెన్షన్స్ లబ్ధిదారులకు 16 రూపాయలు చెల్లించే విదంగా చర్యలు తీసుకోవాలి.జిల్లాలో వికలాంగులపై దాడులు చేసి, బెదిరిస్తున్న వారిపై 2016RPD చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలి.కేసులు నమోదు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్న పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలి.2016RPD చట్టం, 2017 మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్, నేషనల్ ట్రస్ట్,నేషనల్ పాలసీలపై వికలాంగులకు,ప్రభుత్వ అధికారులకు అవగాహనా కల్పించాలి.2016 ఆర్ పీ డి చట్టం ప్రకారం జిల్లా,మండల స్థాయిలో వికలాంగుల సంఘాలు,ప్రభుత్వ అధికారులతో కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలి.వికలాంగులపై దాడులు,వేధింపులు, అన్యాయాలు జరగకుండా రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.పరిశ్రమలలో ప్రమాదాలు జరిగి అంగవైకల్యం ఏర్పడిన వారికి నష్టపరిహారం చెల్లించాలి.పరిశ్రమలాలో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి.ఇందిరా మహిళా శక్తి పథకంలోమహిళా వికలాంగులకు 5 శాతం కేటాయించాలి.ప్రతి మండల కేంద్రంలో నైబర్ హుడ్ సెంటర్స్ ఏర్పాటు చేసి,సిబ్బందిని నియమించాలి.ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను గుర్తించెందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి.గుర్తించిన పోస్టుల భర్తీ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలి.జిల్లా కేంద్రంలో లూయిస్ బ్రేయిలి,హెలెన్ కెల్లర్ విగ్రహాలను ఏర్పాటు చేయాలి.జిల్లాలోని యాదగిరి గుట్ట దేవస్థానం పరిధిలోని షాపింగ్ కంప్లెక్స్ లలో వికలాంగుకు కేటాయించాలని డిమాండ్ చేశారు.జిల్లాలోని వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 25 నుండి మే 14వరకు జిల్లా వ్యాప్తంగా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని తెలిపారు.మే 12 నుండి 14వరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 48గంటల నిరాహార దీక్షలు నిర్వహిస్తని,మే 14నాడు వేలాది మంది వికలాంగులతో కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని తెలిపారు.ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బి స్వామి, జిల్లా కోశాధికారి బి లలిత, జిల్లా ఉపాధ్యక్షులు శ్యామ్ సుందర్, జిల్లా కమిటీ సభ్యులు ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.