మొదటి దశ ఈవీఎం, వీవీ ప్యాడ్ యంత్రాల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి:జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్

Apr 3, 2024 - 19:22
 0  64
మొదటి దశ ఈవీఎం, వీవీ ప్యాడ్ యంత్రాల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి:జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్

జోగులాంబ గద్వాల్   3 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- పారదర్శకంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మొదటి దశ ఈవీఎం, వీవీ ప్యాడ్ యంత్రాల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అదనపు కలెక్టర్ ముసిని వెంకటేశ్వర్లు, ఆర్డిఓ రామచందర్ లతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ ఈవిఎం యంత్రాల మొదటి దశ ర్యాండమైజేషన్ కి ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా ఈవిఎం యంత్రాల ర్యాండమైజేషన్ ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చేపట్టామని అన్నారు. జిల్లాలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలలో గల 594 పోలింగ్ కేంద్రాలకు ఆన్ లైన్ ద్వారా ఈవీఎం యంత్రాలను కేటాయించడం జరిగిందన్నారు.

     జిల్లాలో ఉన్న గద్వాల నియోజకవర్గం పరిధిలో 378 కంట్రోల్ యూనిట్లు, 378 బ్యాలెట్ యూనిట్లు, 424 వివి ప్యాట్ లు కేటాయించగా, అలంపూర్ నియోజకవర్గానికి 363 కంట్రోల్ యూనిట్ లు, 363 బ్యాలెట్ యూనిట్లు, 407 వివి ప్యాట్ లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆన్ లైన్ విధానం ద్వారా పారదర్శకంగా ర్యాండమైజేషన్ నిర్వహించి కేటాయించడం జరిగిందన్నారు. మొత్తం 741 సి.యు లు, 741 బి.యు లు, 831 వి.వి ప్యాట్ లు కేటాయించడం జరిగిందని, జిల్లాలో ప్రస్తుతం 778 బ్యాలెట్ యూనిట్లు, 751 కంట్రోల్ యూనిట్లు, 882 వివి ప్యాట్ లు అందుబాటులో ఉన్నాయన్నారు. మొదటి ర్యాండమైజేషన్ కు సంబంధించిన హర్డ్ కాపీలు, సాఫ్ట్ కాపీలు రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు నరేష్, గద్వాల్ తహశీల్దార్ వెంకటేశ్వర్లు, అలంపూర్ తహశీల్దార్ మంజుల వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333