అన్నపూర్ణ సేవా సమితి 10వ వార్షికోత్సవం వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య గారు.
జగ్గయ్యపేట పట్టణం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం నందు అన్నపూర్ణ సేవా సమితి వ్యవస్థాపకులు మహంకాళి జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో అన్నపూర్ణ సేవా సమితి 10వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గురాదామ్ వ్యవస్థాపకులు,శ్రీ శ్రీ శ్రీ గెంటేల వెంకటరమణ గారు,ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ {తాతయ్య} గారు,మున్సిపల్ చైర్మన్ శ్రీ రంగాపురం రాఘవేంద్ర గారు,మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు గారు,మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నూకల కుమార్ రాజా గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ సేవా సమితి కుటుంబ సభ్యులు,పట్టణ పుర ప్రముఖులు,మరియు అన్నపూర్ణ సేవా సమితి మిత్ర బృందం వారు పాల్గొన్నారు.