ప్రతి వ్యక్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందేలా కృషి చేయాలి.

Oct 20, 2024 - 16:53
 0  5
ప్రతి వ్యక్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందేలా కృషి చేయాలి.

గద్వాల: నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రతి వ్యక్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలుచేసి, ప్రతి వ్యక్తిని ఆర్థికంగా అభివృద్ధి పరిచాలన్నదే తన లక్ష్యమని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి అన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ కలెక్టర్ కార్యాలయంలోని  వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, స్థానిక శాసనసభ్యులు కూచుకుల్ల రాజేష్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, నాగర్ కర్నూలు జిల్లా అదనపు కలెక్టర్లు సీతారామారావు దేవ సహాయం , గద్వాల అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల అధికారులు, బ్యాంక్ అధికారులతో ఈనెల 22వ తేదీన నాగర్ కర్నూల్ పట్టణంలో చేపట్టనున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల అవగాహన సదస్సుపై నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో‌ నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక రకాల పథకాలను ప్రజలకు నిరుద్యోగ యువతీ యువకులకు అందే విధంగా జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు తెలియజేశారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలిసే విధంగా అవగాహన కార్యక్రమాన్ని ఈనెల 22వ తేదీన నాగర్ కర్నూలు పట్టణంలోని తేజా కన్వెన్షన్ హాల్ నందు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమంలో నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ మరియు ఎం ఎస్ ఎం ఈ,వివిధ బ్యాంకులకు సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొంటారని, ప్రభుత్వాలు అందించే పలు పథకాల కు సంబంధించిన రుణాల మంజూరి, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు లాంటి విషయాలను వివరిస్తారని తెలియజేశారు. నాగర్ కర్నూల్ లో నిర్వహించే అవగాహన సదస్సు ఒక మోడల్ సదస్సుల ఉంటుందని ఎంపీ తెలిపారు.
ప్రజలు తమకు అనుకూలమైన రుణాలను పొందడంతోపాటు  అవసరమైన వారికి రుణాల మంజూరుతో పాటు బ్యాంకుల గ్యారెంటీని అందించేలా కార్యక్రమం ఉంటుందని ఎంపీ తెలిపారు. ముఖ్యంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని యువతి యువకులు వ్యాపారవేత్తలుగా మారే అవకాశాలను తెలియజేస్తారని సూచించారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం లోని వివిధ శాఖలకు చెందిన ఉన్నత అధికారులు ఈ అంశాలను తమ శాఖ పరిధిలోని అధికారులకు తెలియజేసి ఆయా శాఖల యందు తమ పేర్లు నమోదు చేసుకున్న వారందరినీ అవగాహన సదస్సు కు హాజరయ్యేలా చూడాలని తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అన్ని రకాల పథకాలు ప్రజలకు వివరించాలని అధికారులు, బ్యాంకు అధికారులకు ఎంపీ సూచించారు. బ్యాంకులు అందించే రుణ సదుపాయం, సబ్సిడీ లాంటి అంశాలు నిరుద్యోగ యువతీ యువకులకు తెలుపాలని కోరారు. అదేవిధంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో మరిన్ని ప్రాంతాల్లో కెనరా బ్యాంకు సేవలందించాలని అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.  ప్రతి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న పథకాల ద్వారా రుణాలు అందించే విధంగా బ్యాంకర్లు సిద్ధంగా ఉండాలని కోరారు.‌ ముఖ్యంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడుకు చెందిందిన నియోజకవర్గమని ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజల ఆర్థిక అభ్యున్నతికి బ్యాంకర్లు కృషి చేయాలన్నారు. 
అదేవిధంగా ప్రతి వ్యక్తికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రుణాల గురించి తెలియాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
సిఎస్ఆర్ నిధులతో విద్యా వైద్యానికి ఖర్చు చేసి మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతోనే నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఎస్సీ, ఎస్టీ, బిసి గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలలో మూత్రశాలలు అవసరమైన త్రాగునీరు విద్యుత్తు  ఫ్యాన్లు మౌలిక వసతుల ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ తెలిపారు. ప్రతి ఒక్కరూ విద్య వైద్యానికి కృషి చేయాలని ఆయన సూచించారు.‌ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ,
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి వ్యక్తికి అందాలనే ఉద్దేశంతోనే నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు నాగర్ కర్నూల్ పట్టణంలో పెద్ద స్థాయిలో అవగాహన సదస్సు  నిర్వహించడం చాలా సంతోష నియమని కలెక్టర్ తెలిపారు. 
నాగర్ కర్నూల్ పట్టణంలోని తేజ కన్వెన్షన్ హాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్వయం ఉపాధి సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించ నున్నట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ తెలిసేలా,
వివిధ బ్యాంకులు అందించే రుణాలు, సబ్సిడీలు నిరుద్యోగ యువతీ యువకులకు తెలిసేలా అవగాహన ఈ సదస్సు ద్వారా కల్పించ నున్నట్లు తెలిపారు.
జిల్లా అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ఈ నెల 22వ తేదీన జరగబోయే స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన సదస్సు విజయవంతం అయ్యేటట్లు చూడాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు నిరుద్యోగ యువతీ యువకులకు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ప్రతి డిపార్ట్మెంట్ అందిస్తున్న పథకాలు, సబ్సిడీలు, ప్రయోజనాలు తెలియజేసేలా విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. 
ఈ అవగాహన సదస్సుకు వివిధ బ్యాంకులు అందిస్తున్న రుణ సదుపాయం లాంటి విషయాలు తెలియజేసేలా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయని, చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే విధంగా మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న  పథకాలు ప్రజలకు తెలియజేయాలన్నారు.
నాగర్ కర్నూల్ పార్లమెంటుe నియోజకవర్గ పరిధిలోని యువతీ యువకులకు ఐటిఐ, డిప్లమా కోర్సుల తదనంతరం ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అవగాహన కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. 
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు అందిస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలను ఈ సందర్భంగా అవగాహన కల్పిస్తామని సూచించారు. 

ఈ కార్యక్రమంలో వివిధ రంగాలలో నిష్ణాతులైన వారిచే  అవగాహన కలిగించే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలియజేశారు.
స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ, నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో  జరగనున్న అవగాహన సదస్సుకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరవుతారని, ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనేలా అధికారులు చూడాలన్నారు. అన్ని వర్గాల యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలియజేశారు.డిగ్రీ విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడటానికి ఒక మైలురాయిగా ఈ అవగాహన సదస్సు నిలుస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. 
అందుకు పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రతి యువకుడు పాల్గొనేలా అధికారులు చూడాలని సూచించారు.

    ఈ కార్యక్రమంలో నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జోనల్ అధికారి  శ్రీనివాస్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ అవార్డు ఎన్జీవో అధ్యక్షుడు వెంకట్, నాగర్ కర్నూల్ డి ఆర్ డి ఏ చిన్న ఓబులేసు, డీఈవో గోవిందరాజులు, బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి నజీమ్ ఆలీ, ఎస్సీ వెల్ఫేర్ జిల్లా అధికారి రామ్ లాల్ , ,డి ఆర్ డి ఓ ,ఉమాదేవి, ఎల్ డి ఎం శ్రీనివాసులు, కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ కాన్ఫిడరేషన్ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కోఆర్డినేటర్ పి శ్రీనివాస్, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైజెస్ ప్రెసిడెంట్ నల్లబాబు, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖల ఆర్ సి ఓ లు, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333