అత్యవసర వైద్య సేవలకు దూరం పోవాల్సిందేనా ?

అత్యవసర వైద్యం కోసం నగరం కై పరుగులు.
సాయంత్రం అయితే చాలు ఆసుపత్రికి తాళం ?....
తిరుమలగిరి 01 జూన్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
మున్సిపాలిటీ వ్యాప్తంగా ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే..అత్యవసర వైద్య సేవలకు సౌకర్యవంతమైన దావఖానే లేదు.అటు సూర్యాపేట ఖమ్మం లేదంటే హైదరాబాద్,హన్మకొండ వంటి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలే..ఇక్కడ వారికి దిక్కవుతున్నాయి.వైద్య కళాశాలలు, మెరుగైన సౌకర్యాలతో ఏరియా హాస్పిటల్స్ అప్డేట్ చేసిన అత్యవసర (ఎమర్జెన్సీ) వైద్య కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లే లోపే ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.తిరుమలగిరి వంటి అభివృద్ధి చెందుతున్న పట్టణంలో 24 గంటల వైద్య సౌకర్యానికి ప్రభుత్వ దవాఖానాల్లో ఎంబీబీఎస్/ఎంఎస్ అర్హత కలిగిన వైద్యులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.కనీసం ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు పెట్టిన వైద్యం చేయలేని పరిస్థితి నెలకొంది. అరకొరా వసతులతో చిన్నాచితక శస్త్ర చికిత్సలు చేస్తూ కాలమెల్లదీస్తున్న ప్రవేట్ హాస్పిటల్లో సమయానికి వైద్యులు ఉండకపోవడం ఇక్కడి ప్రాంత ప్రజల దుస్థితి. ఎమర్జెన్సీ వైద్యం సామాన్యులకు దూరమనే చెప్పవచ్చు.దానికి తోడు నకిలీ మందులు,నకిలీ వైద్యులు ప్రజల ప్రాణాలతో చెలగాటం.పెద్ద పట్టణాలకు రోగులలో రిఫర్ చేస్తే కమిషన్ వస్తుందని ఆలోచనతో చెలరేగిపోతున్న గ్రామీణ వైద్యులు.చిన్న సమస్యను సైతం పెద్దగా చూపుతూ రోగులను భయభ్రాంతులకు గురిచేసి స్కానింగ్,టెస్టుల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారు.ఏ టెస్టులు ఎందుకు చేస్తున్నారో.. వారికే తెలియదు.అనుమతులు లేని డయాగ్నటిక్ సెంటర్లు,అర్హత లేని ల్యాబ్ టెక్నీషియన్ విచ్చలవిడిగా క్లినిక్ లు పెట్టి రోగం అని వచ్చిన వారిని అయోమయానికి గురి చేస్తున్నారు.
పేరుకే తనిఖీలు..చర్యలేం ఉండవు., అధికారులు నిర్వాహకులు ఒకటే అంటున్న ప్రజలు.. ..
ఏదైనా తప్పు దొరికినప్పుడు పత్రికల్లో వచ్చే వార్తలు కథనాలకు అధికారులు స్పందిస్తూ తనిఖీలు నిర్వహిస్తారే తప్ప.,చర్యలు ఏమి ఉండవని ఔషధ దుకాణ యజమానులతో,క్లినిక్ నిర్వాహకులతో కాసులకు కక్కుర్తిపడి సంబంధిత అధికారులు చూచి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజల్లో వినిపిస్తున్న మాట. డ్రగ్ ఇన్స్పెక్టర్ జాడ కనబడదు.,ప్రైవేట్ హాస్పిటల్లో తనిఖీలు ఉండవు.,నకిలీ వైద్యులను గుర్తించి చర్యలు తీసుకోవడం ఉండదు కేవలం వైద్య ఆరోగ్యశాఖలో కాకుండా అన్ని శాఖల్లో ఇదే తంతు.ఇదే విషయంలో ఇటీవల సూర్యాపేట జిల్లా డిఎంహెచ్వో కు వేటు పడిందని చెప్పవచ్చు.
ప్రభుత్వ అధికారుల తీరు పట్ల.,ప్రజల్లో నమ్మకం లేదు.
ఏ ప్రభుత్వ ఉద్యోగైనా,అధికారైన మీ స్వార్థంగా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తే..ఏ సమస్యలు తలెత్తవు.కానీ విరుద్ధంగా ప్రవర్తిస్తూ..ప్రజలను మోసం చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడితే నామమాత్రపు చర్యలు తీసుకుని వదిలేయడం పట్ల ప్రజల్లో ప్రభుత్వ అధికారుల చిత్తశుద్ధికి నమ్మకం లేకుండా పోతుందని పలువురు పేర్కొంటున్నారు. విద్యా వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ.. మున్సిపాలిటీ కేంద్రం లాంటి పట్టణాల్లో మెరుగైన వైద్యంతో కూడిన దవాఖాణాలు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యంపై శ్రద్ద చూపాలని,ఏటూ చుట్టూ 30 కిలోమీటర్ల పరిధిలోనే వైద్య కేంద్రాలు ఉండాలని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఎయిమ్స్ లాంటి దావఖానాల్లో ఎమర్జెన్సీ వైద్య సేవలను అందించాలని కోరుతున్నారు.ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేసి మెరుగైన సమాజం కోసం,ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు..... ......