మందుల సామెల్ కు మంత్రి పదవి ఇవ్వాలి వంగూరి దామోదర్

తిరుమలగిరి 01 జూన్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు మంత్రి వర్గం విస్తరణలో మలిదశ తెలంగాణ ఉద్యమాకారుడు, తుంగతుర్తి నియోజకవర్గ శాసన సభ్యులు మందుల సామేలు కి మంత్రి పదవి ఇవ్వాలనీ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, టెక్నో డిడ్ సంస్థ చైర్మన్ వంగూరి దామోదర్ డిమాండ్ చేసారు. ఎమ్మెల్యే గా సంవత్సర కాలం పూర్తి కాక ముందే నియోజక వర్గంలోని తిరుమలగిరి మునిసిపాలిటీలో ముప్పై ఏళ్ల కల ప్రభుత్వ కళాశాల, మోత్కూరు మున్సిపాలిటీలో ప్రభుత్వ కళాశాల, ప్రయాణ ప్రాంగణం ఏర్పాటుకై శ్రీకారం చుట్టిన ఏకైక నాయకుడిగా సామేల్ గుర్తింపు తెచ్చుకున్నాడన్నారు. గతంలో రాష్ట్ర మొదటి గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రాష్ట్ర సాధనలో తుంగతుర్తి పోరాటాల గడ్డమీద గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజల అభిమానాన్ని పొంది సుపరిచితుడుయ్యారన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం విస్తరణ లో దళిత సామజిక వర్గం నుండి గెలిచిన మందుల సామెల్ కు మంత్రి పదవి ఇవ్వాలని, దళితుల పక్షాన పోరాడే అవకాశం కల్పించాలని సి ఎం రేవంత్ రెడ్డిని కోరారు......