**వరద ప్రాంతాల పంట పొలాలను పరిశీలించిన తెలుగుదేశం పార్టీ నాయకులు.* జిల్లా నాయకులు కొండబాల కరుణాకర్*

Sep 19, 2024 - 14:08
 0  105
**వరద ప్రాంతాల పంట పొలాలను పరిశీలించిన తెలుగుదేశం పార్టీ నాయకులు.* జిల్లా నాయకులు కొండబాల కరుణాకర్*

పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం లో వరద ప్రాంతాల పంటపొలాల ను పరిశీలించిన తెలుగుదేశం పార్టీ నాయకులు 

రామచంద్రాపురం, సుద్దేపల్లి, బుద్దారం, పైనంపల్లి తదితర గ్రామాలు పాలేరు నదీ పరివాహక ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ మండల జిల్లానాయకులు పర్యటించారు వరద ముంపుతో వరి ప్రత్తి తదితర పంటలు పూర్తిగా దెబ్బతినటమే కాకుండా పొలాలు ఇసుక మేటలతో కోత కోసి రాళ్లు రప్పలతో పొలాలు నిండాయని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు . అక్కడకు వెళ్లిన తెలుగుదేశం నాయకులను కలసి రైతులు బోరున విలపించారు మా పొలాలు వ్యవసాయానికి పనికి రావని యకరాకు ఇప్పటికే 30 వేల రూపాయలు విత్తనాలు ఎరువులు తదితర ఖర్చులు అయ్యాయని వారి గోడు వెళ్లబోసుకున్నారు. 

రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టి కి తీసుక వెళ్తామని రైతులకు తెలుగుదేశం నాయకులు హామీ ఇవ్వటం జరిగింది, రైతుల కరెంటు మోటార్లు పైపులు తదితర సామాగ్రి లక్షల్లోనష్టం జరిగిందని ప్రభుత్వం ఇచ్చే 10 వేలరూపాయలు ఇసుక మేటలు తీయటానికి కూడ సరిపోవని వాటిని కూడ ప్రభుత్వం ఇంతవరకు రైతులకు అందించలేదని యకరాకి 30 వేలరూపాయలు ఇవ్వాలని తెలుగుదేశం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. అలాగే పోయిన నష్టం ఆ విదంగా జరిగితే వున్న కొంత పంటపొలాల కి నీరు లేదని , పాలేరు జలాశయం కాల్వ తెగిపోయిందని అలాగే భారీగా దెబ్బతిన్న విద్యుత్ స్ధంబాలు కరెంటు వైర్లు వరదలో కొట్టుకు పోయాయని వారు ప్రత్యక్షంగా చూసారు వాటిని వెంటనే మరమ్మత్తు చేయాలని సాగర్ నీరు కూడ వెంటనే వదలి కొంత మేరకైనా పంట పొలాలను కాపాడాలని నియోజకవర్గ శాసన సభ్యులు రెవిన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేసారు నష్టపోయిన రైతులు కూడ హరిజన గిరిజన వెనుక బడిన కులాలకు చెందిన యకరా రెండు యకరాల సన్నకారు రైతులు వున్నారని వారిని గుర్తించి అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేసారు, వూర్లో ఇల్లు , అడవి లో చేలు స్మశానాలను తలపిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేసారు కావునా ప్రభుత్వం రైతులను వెంటనే ఆదుకోవాలని వారు డిమాండ్ చేసారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కొండబాల కరుణాకర్ , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సూరపనేని రామక్రిష్ణ , గడిపూడి వెంకటేశ్వర్లు ,అరెక్లట్లకొండలరావు, నల్లమాస మల్లయ్య , గోగినేని సీతారాంబాబు , దుద్దేటి గోపాలరావు , వీసం శ్రీనివాసరావు , రాయల కోటేశ్వరరావు , కోలేటి మస్తాన్ రావు, తాటికొండ నాగేశ్వరరావు ,కాసాని బడేసాబ్ , నూక హనుమంతరావు దిద్దేటి బాబు వల్లూరి శ్రీనివాసరెడ్డి ఖమ్మం పాటి రవి నెమలి కాంతాయమ్మ మేదర మెట్ల గోవిందు , దిద్దేవి కోటయ్య పొట్ట పింజర భూపతి మామిడి రాజ దిద్దేటి భిక్షం తదితర రైతులు నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State