**హామీలు అమలు చేయాలి""సిపిఎం జిల్లా నాయకులు*

తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ : *హామీలు అమలు చేయాలి*
రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానంలో ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని సిపిఎం జిల్లా నాయకులు మెదరమెట్ల వెంకటేశ్వరావు పట్టణ కార్యదర్శి ఎం ముత్యాలు డిమాండ్ చేశారు
మంగళవారం స్థానిక కోదాడ పట్టణంలో సర్వే అనంతరం వచ్చిన సమస్యలతో కూడిన. వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ గారికిఅందజేయడం ఎన్నిక జరిగింది
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదు రోజులుగా కోదాడ పట్టణంలో స్థానిక సమస్యలపై సర్వే చేయడం జరిగిందని, పట్టణంలో డ్రైనేజీ మంచినీటి సమస్యలు తదితర సమస్యలు మా దృష్టికొచ్చేయను వారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానంలో మహాలక్ష్మి గృహలక్ష్మి గృహ జ్యోతి రైతుబంధు రైతు భరోసా రైతు బీమా రైతు రుణమాఫీ బోనస్ పథకాలు ప్రకటించి నేటికి 15 మాసాలు పూర్తి అయినప్పటికీ అది అమలుకు నోచుకోలేదని ఆయన విమర్శించారు ఇందిరమ్మ ఇండ్లు పింఛన్లు రేషన్ కార్డులు కోసం వేలాదిమంది దరఖాస్తులు పెట్టకున్న నేటికీ లబ్ధిదారుల ఎంపిక జరగలేదని ఆయన అన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా పథకాల అమలుకు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు యొక్క కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు జుట్టుకొండబసవయ్య కోదాడ మండల కార్యదర్శి అలసగాని బ్రహ్మయ్య టౌన్ కమిటీ సభ్యులు దాసరి శ్రీనివాస్ రాముడు రామారావు సతీష్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.