అడ్డగూడూరు మండలం కాదా.. స్టేజ్ వద్ద ఆర్టీసీ బస్సులను ఎందుకు ఆపరు?విద్యార్థి సంఘాలు నాయకులు నిరసన

Mar 25, 2025 - 19:45
 0  168
అడ్డగూడూరు మండలం కాదా.. స్టేజ్ వద్ద ఆర్టీసీ బస్సులను ఎందుకు ఆపరు?విద్యార్థి సంఘాలు నాయకులు నిరసన

అడ్డగూడూరు 25 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని చౌళ్ళరామారం,అడ్డగూడూరు స్టేజి వద్ద తొర్రూరు వలిగొండ నేషనల్ హైవే పైన నడిపే బస్సులు  అడ్డగూడూరు స్టేజి వద్ద ఆర్టీసీ బస్సులను ఆపాలని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో  దాదాపు గంట రాస్తారోకో నిర్వహించడం జరిగింది.అనంతరం ఫోన్లో మాట్లాడిన అడ్డగూడూరు ఎస్సై డి నాగరాజు సూచన మేరకు బస్సులలో ప్రయాణించే ప్రయాణికుల ఇబ్బందుల దృష్టిలో ఉంచుకొని రాస్తారోకో ముగించిన విద్యార్థి నాయకులు ఈ సందర్భంగా ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ.. అడ్డగూడూరు స్టేజి వద్ద గతంలో ఎక్స్ప్రెస్ ఆర్డినరీ డీలక్స్ బస్సులు ఆపేవారని మహాలక్ష్మి ఫ్రీబస్ పథకం వచ్చినప్పటినుండి అడ్డగూడూరు స్టేజి వద్ద బస్సులను ఆపకపోవడంతో ప్రయాణికులు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.దాదాపు మండలంలోని అన్ని గ్రామాలు గట్టుసింగారం,మానాయకుంట, గోవిందపురం,అడ్డగూడూరు ధర్మారం, లక్ష్మీదేవికాల్వ, ప్రజలు విద్యార్థులు అడ్డగూడూరు స్టేజి వద్దకు వచ్చి హైదరాబాద్ వెళ్లడానికి ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తుంటారు బస్సులు ఇక్కడ స్టేజ్ వద్ద ఆపకపోవడంతో దాదాపు కిలోమీటర్ మేర నడవాల్సిన పరిస్థితి ఉందని ఇలాంటి పరిస్థితిలు రాకుండా స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్  జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రత్యేక చొరవ తీసుకొని అడ్డగూడురు స్టేజి వద్ద ఆర్టిసి బస్సులు ఆపటానికి కృషి చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఐక్య విద్యార్థి సంఘాలు ఏస్ ఏస్ యు నాయకులు  చిప్పలపల్లి వంశీ కుమార్,చెరుకు శివరాజు,జిల్లా రాకేష్,సంతోష్,బిఆర్ఎస్వి నాయకులు ఎడ్ల ప్రేమ్ కుమార్,మేడబోయిన  రాజు ఏఐఎస్ఎఫ్ నాయకులు ఉప్పల వంశీ, మందుల ప్రశాంత్,తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333