తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవి ముదిరాజు లకు కేటాయించాలి

ముదిరాజ్ మండల అధ్యక్షులు కమిటీ సైదులు ముదిరాజ్
తెలంగాణ వార్తమాడుగులపల్లి25 : తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుని ఎంపిక విషయంలో బీసీలలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని ముదిరాజులలో సీనియర్ నాయకులైన ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు మంత్రి పదవి చేసి తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి రాష్ట్రం మీద మంచి పట్టు అవగాహన వున్న నాయకుడు ఈటల రాజేందర్ కు రాష్ట్ర బాధ్యతలు అప్పజెప్పాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభల మాడుగులపల్లి మండల అధ్యక్షులు తవిటీ సైదులు ముదిరాజ్ కోరారు.ఏదైనా కారణం చేత రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వని ఎడల కేంద్రం మంత్రివర్గంలో స్థానం కల్పించాలని అన్నారు.అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది సందర్భంగా రాష్ట్ర కొత్త మంత్రులను ఎంపిక చేయనున్న తరుణంలో ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ముదిరాజుల ఒకే ఒక ఎమ్మెల్యే అయినటువంటి వాకిటి శ్రీహరి ముదిరాజ్ మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరారు.