తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ని కలిసిన
భువనగిరి జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి
అడ్డగూడూరు 26 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టుర్:- భువనగిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి జన్మదిన సందర్భంగా కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.ఈ సందర్భంగా అనేక అంశాలపై మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చేసిన పోరాటాలను గుర్తుచేసారు.భువనగిరి జిల్లా రాజకీయాలపై కాసేపు చర్చించి.ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశత్వ విధానాలపట్ల ప్రజలకు మరియు రైతులకు అండగా ఉండాలని అవసరమైతే పోరాటాలు చేయటానికి సిద్ధంగా ఉండాలని అన్నారు