అడ్డగూడూరు గురుకుల కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్
అడ్డగూడూరు 29 జూలై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం మంగమ్మగూడెం గురుకుల కళాశాల నందు మొదటి సంవత్సరం ఎంపీసీ,బైపిసిలో పరిమిత ఖాళీల భర్తీకి తేదీ 31.07.2025న స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనునట్లు కళాశాల ప్రిన్సిపాల్ బి.విజిన ఒక ప్రకటనలో తెలిపారు.ఆసక్తి గల విద్యార్థినిలు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లుతో హాజరు కావాలని అన్నారు. ఉదయం 9 గంటల నుండి 1.గంట వరకు అప్లికేషన్ స్వీకరించబడును మధ్యాహ్నం 2 గంటల తర్వాత మెరిట్ మరియు పరిమిత ఖాళీల ప్రతిపాదికన సీట్లను కేటాయించబడును అని అన్నారు. మరిన్ని విషయాల కొరకు ఈ ఫోన్ నెంబర్ 9704550275 సంప్రదించాలని అడ్డగూడూరు గురుకుల ప్రిన్సిపాల్ తెలిపారు.