గన్ మిస్ ఫైర్ :అపార్ట్ మెంట్ దూసుకొచ్చిన బుల్లెట్ 

Jul 13, 2024 - 17:34
 0  6
గన్ మిస్ ఫైర్ :అపార్ట్ మెంట్ దూసుకొచ్చిన బుల్లెట్ 

హైదరాబాద్: జులై 13: తుపాకులు మిస్ ఫైర్ వంటి సంఘటనలు హైదరాబాద్, వరంగల్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా చోటు చేసుకో వడం గమనార్హం. గన్ మిస్ ఫైరింగ్ వల్ల పోలీస్ కానిస్టే బుల్, ఎస్సై, ఓ డీఎస్పీ ఇలా చాలా మంది మరణించిన ఘటనలు చోటు చేసుకు న్నాయి. 

తాజాగా ఇవ్వాళ హైదరా బాద్ నార్సింగి బైరాగిగూడ లో బుల్లెట్ కలకలం సృష్టిం చింది. ఈ బుల్లెట్ ప్రమాదం లో ఎవ్వరికీ ఏమి కాకపోవ డంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

బైరాగిగూడలోని ఓ అపార్టు మెంట్ లోని 5 అంతస్తులోని కిటికి అద్దాలు ధ్వంసం కావడంతో పాటు ఏకంగా బెడ్ రూమ్ లోకి బుల్లెట్ దూసుకొచ్చింది. దీంతో అపార్టుమెంట్ వాసులు పరుగులు తీశారు. 

ఆర్మీ ఫైరింగ్ రేంజ్ గన్ మిస్ ఫైర్ కావడంతో బుల్లెట్ దూసుకొచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకు న్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333