**గోకినపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన""రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు*

Apr 11, 2025 - 20:48
 0  12
**గోకినపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన""రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు*

*కోనుగోలు కేంద్రాల్లోని ధాన్యం విక్రయించాలి..*

*ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు,డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్..*

తెలంగాణ వార్త ప్రతినిధి ముదిగొండ: ది.11.04.2025 ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం గోకినపల్లి గ్రామంలో ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ప్రారంభించారు..ఈ సందర్భంగా మాట్లాడుతూ ‌ రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర బోనస్ పొందాలని అన్నారు.. సన్నలతో పాటు దొడ్డు ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కోకటి ‌‌అమలు చేస్తుందని అన్నారు.. అలాగే సన్న రకం పండించిన రైతులకు 500/- బోనస్ ఇస్తున్నామని, రైతులు దళారులకు వడ్లు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కోనుగోలు కేంద్రాల్లో అమ్మి గిట్టుబాటు ధర పోందాలని ఈ సందర్భంగా వారు సూచించారు..ఈ కార్యక్రమంలో జిల్లా ఓబిసి సెల్ అధ్యక్షులు మోక్క శేఖర్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోమ్మినేని రమేష్ బాబు,సామినేని వెంకటయ్య, పసుపులేటి దేవెందర్,వినోద్,మీగడ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు..

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State