అక్రమఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు ను సీజ్ చెయండి.. ఆర్డీవో వేణుమాధవరావు
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ అక్రమఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు ను సీజ్ చెయండి. ఇసుక అక్రమ రవాణా చేసిన వారు ఎంతటి వారైనా చట్టపరంగా శిక్షించబడతారని అనుమతులు లేకుండా ఇసుకను తరలించే ట్రాక్టర్లను వెంటనే సీజ్ చేయనున్నట్లు సూర్యాపేట ఆర్డిఓ వేణుమాధవరావు తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ఆత్మకూరు మండలంలో ఇసుక దందాల హోరు ఎక్కువైందని ఎక్కడైనా అనుమతులు లేకుండా ఇసుక తరలించిన ట్రాక్టర్లను సీజ్ చేయాలని అదే విధంగా మరోసారి ఇసుక తరలించిన వారికి బైండోవర్ చేయాలంటూ అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా మండల కేంద్రానికి రెవెన్యూ కార్యాలయంలో పనులు ఉండి వచ్చే ప్రజల కోసం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో చలివేంద్ర ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ అమీన్ సింగ్ రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.