గ్రామ సభలను పకడ్బందీగా నిర్వహించాలి. డి ఎల్ పి ఓ

Apr 1, 2026 - 20:08
Apr 3, 2026 - 14:01
 0  0
గ్రామ సభలను పకడ్బందీగా నిర్వహించాలి. డి ఎల్ పి ఓ

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ గ్రామ సభలను పకడ్బందీగా నిర్వహించాలి. డి ఎల్ పి ఓ. . 99 రోజుల ప్రజా పాలన కార్యక్రమాల్లో భాగంగా నేడు గ్రామ గ్రామాన గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించాలని డిఎల్పిఓ నారాయణరెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని నసింపేట గ్రామపంచాయతీ ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా పలు రికార్డులు పరిశీలించి, గ్రామంలోని పలు విధులను పరిశీలించి పరిశుభ్రతను పాటించాలని అన్నారు. గ్రామ సభలలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని అన్నారు. ఆయన వెంట ఎంపీడీవో హసీం, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.