అక్రమంగా ఇసుక తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు ఎస్సై వెంకట్ రెడ్డి
అడ్డగూడూరు 27 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని ధర్మారం గ్రామం బిక్కెరు వాగు నుండి ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నటువంటి వ్యక్తి అడ్డగూడూరు మండల కేంద్రానికి చెందిన తూప్పతి కృష్ణమూర్తి తండ్రి మల్లయ్య, వయస్సు 48 సంవత్సరాలు విద్యుత్ కార్యాలయంలో లైన్మెన్ గా పనిచేస్తూ..అక్రమంగా ఇసుక తరలిస్తుండగా అడ్డగూడూరు ఎస్సై వెంకట్ రెడ్డి అదుపులోకి తీసుకోని అతనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ప్రస్తుతం నిందితుడు ఆత్మకూరు మండలం కప్రాయిపల్లి సబ్ స్టేషన్ లో లైన్మెన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.