ప్రజా విప్లవ గాయకుడు కామ్రేడ్ అరుణోదయ... నాగన్నకు ఇవే మా జోహార్లు
ఆయన జీవితం నేటి తరాలకు స్ఫూర్తిదాయకం
ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం రిజిస్టర్డ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి డా కె వి కృష్ణారావు అరుణోదయ... నాగన్న పార్థిక దేహాన్నికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు . ప్రజా సాంస్కృతిక ఉద్యమం పట్ల ఆయనకున్న నిబద్ధత చాలా గొప్పదని ఆయన మరణం బహుజనులకు తీరని లోటని పేద కుటుంబంలో జన్మించి ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్న మహనీయుడని ఆయన జీవితం నేటి తరాలకు స్ఫూర్తిదాయకం ఆయన ఆటపాటలతో సమాజాన్ని మేల్కొల్పి పేదవాడి గుండెలో వెలుగై నిలిచారని అన్నారు . ఈ కార్యక్రమంలో పగడాల నరేందర్ , బొబ్బిలి భరత్ చంద్ర , బానోతు భద్రు నాయక్ , అనిల్ కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు .