బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా నూకల సుదర్శన్ రెడ్డి
సూర్యాపేట, 27 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– సూర్యాపేట బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా నూకల సుదర్శన్ రెడ్డి గెలుపొందారు. గురువారం సూర్యాపేట జిల్లా కోర్టుల సముదాయంలో జరిగిన ఎన్నికలలో నూకల సుదర్శన్ రెడ్డి బాణాల విజయ్ కుమార్ పై 35 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బాణాల విజయ్ కుమార్ కు 82 ఓట్లు రాగా, నూకల సుదర్శన్ రెడ్డికి 117 ఓట్లు ఫోల్ అయ్యాయి. ఉపాధ్యక్షులుగా పోలేబోయిన నరసయ్య యాదవ్ (106), జనరల్ సెక్రెటరీగా తల్లమల్ల హసేన్, జాయింట్ సెక్రటరీగా పసల బాలరాజు(118), స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా పత్తిపాక రాధాకృష్ణ, 30 ఇయర్స్ ఈసీ మెంబర్ గా వసంత సత్యనారాయణ పిల్లయ్ యాదవ్( ఏకగ్రీవం) 20 సంవత్సరాల ఈసీ మెంబర్ గా బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్(134), 2ఇయర్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా బొజ్జ అనిల్(95), మందుల శ్రీనివాస్(92), మీసాల శ్రీనివాస్(126) గెలుపొందారు. కాగా 20 సంవత్సరాల ఈసీ మెంబర్ గా బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్ అత్యధికం గా 134 ఓట్లు పోలయ్యాయి. ఈ సందర్భంగా విజేతలను సూర్యాపేట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఎండి షఫీ ఉల్లా, న్యాయవాదులు, టేకులపల్లి శ్రీనివాసరావు, బత్తిని వెంకటేశ్వర్లు గౌడ్, సినేపల్లి సోమేశ్వర్, ఫరీదుద్దీన్, కోణం రఘురామయ్య, గుంటూరు మధు, కొక రంజిత్, దయాకర్ రావు తదితరులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్, జూనియర్, మహిళ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.