తమ చిన్నారుల మంచి భవిష్యత్ కు తల్లి దండ్రులు తోడ్పడాలి:జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు

Feb 1, 2025 - 19:14
 0  1
తమ చిన్నారుల మంచి భవిష్యత్ కు తల్లి దండ్రులు తోడ్పడాలి:జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు

ఆపరేషన్ స్మైల్ బృందం దాడులో 43 మంది  బాల కార్మికులకు విముక్తి ఎస్పీ

జోగులాంబ గద్వాల 1 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి:  జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్-XI బృందం దాడులు నిర్వహించి జిల్లా వ్యాప్తంగా 43 బాలకార్మికులను గుర్తించి వారిని పని నుండి విముక్తి కలిగించి, అందుకు సంబంధించి 2 కేసులు నమోదు చెయ్యడం జరిగిందనీ జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు శనివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు కనబడితే వెంటనే డయల్100 కి కానీ 1098 కి కానీ  కాల్ చేసి వారికి సమాచారం ఇవ్వగలరని ఎస్పీ సూచించారు. అలగే స్కూల్ డ్రాప్ ఔట్ అయిన మరో 183  పిల్లలకు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి పాఠశాలలో చేర్పించడం జరిగిందనీ,జిల్లా లో బాల బాలికల ను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని, తమ చిన్నారుల మంచి భవిష్యత్  కు  తల్లి దండ్రులు తోడ్పడాలని సూచించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333