బడ్జెట్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమాన్ని విమర్శించాలి

Jul 29, 2024 - 16:49
 0  4
బడ్జెట్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమాన్ని విమర్శించాలి

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ బడ్జెట్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమాన్ని విస్మరించి, వికలాంగుల పునరావాసలకు పెన్షన్ పెంపునకు నిధులు కేటాయించకపోవడం పై భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆగ్రహం బడ్జెట్ సవరించి 5శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆత్మకూరు ఎస్ మండలం కందగట్ల లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ పత్రాలు దగ్ధం* కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు బడ్జెట్ నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆధ్వర్యంలో ఆత్మకూరు ఎస్ మండలం కందగట్ల గ్రామంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు ఈ సందర్బంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడుతూ కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి ఆర్థిక నిర్మల సీతారామన్ బడ్జెట్లో వికలాంగులకు నిరాశను మిగిల్చితే రాష్ట్రంలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన. రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్లో వికలాంగులకు భరోసా లేకుండా చేశారని కేంద్ర ప్రభుత్వం వికలాంగుల సాధికారతకు 2024-25 బడ్జెట్లో 1225.27 కోట్లు కేటాయించిది. గత సంవత్సరం బడ్జెట్తో పోల్చితే 0.02 శాతం పెంచింది. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం బడ్జెట్ లో 5శాతం నిధులుకేటాయించాల్సి ఊన్న.వికలాంగుల కోసం అమలవుతున్న సంక్షేమ పథకాల కోసం కేవలం 615.33కోట్లు కేటాయించి చేతులు దులుపుకుందని.దీన్ దయాల్ వికలాంగుల పునరావాస పథకాన్ని అర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు మాత్రం పెంచకుండా 165 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుందని వికలాంగుల క్రీడాకారులను ప్రోత్సాహస్తున్నామని ఒక వైపు చేప్పుతూ మరో వైపు నిధులు మాత్రం 76 కోట్ల నుండి 25 కోట్లకు తగ్గించడం అన్యాయమని ఇందిరా గాంధీ నేషనల్ డిసెబుల్డ్ పెన్షన్ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. 2011నుండి కేవలం 300 రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తున్నారని ధరల పెరుగుదలకు అనుగుణంగా పెన్షన్ ఎందుకు పెంచడం లేదని తక్షణమే పింఛన్ వాటాను 3000 పెంచాలని డిమాండ్ చేసిన ఆయన *తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించలేదో వికలాంగుల సమాజానికి సమాధానం చెప్పాలని*. బడ్జెట్ ప్రసంగంలోనూ వికలాంగుల ప్రస్తావనే లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగుల సమాజాన్ని విస్మరించిందని రాష్ట్ర బడ్జెట్ లో 5 శాతంనిధులు కేటాయించాల్సి ఉంటే ఒక్క పైసా కూడా చిటంచకుండా. వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూసిందని అధికారంలోకి వస్తే పెన్షన్ 6000 రూపాయలకు పెంచాతామణి చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్లో ఆ ప్రస్తావనే లేకపోవడం దురదృష్టకరమని . వికలాంగుల పరికరాలు, స్వయం ఉపాధి రుణాల కోసం పైసా కూడా కేటాయించప్పడం అన్యాయమన్నారు.వెంటనే బడ్జెట్ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ సవరించి 5శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆత్మకూరు ఎస్ మండల అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు సంఘం జిల్లా యూత్ నాయకులు గుంట శివకుమార్ సంఘం మహిళా నాయకురాలు గోగుల పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు