అక్రమ అరెస్టులే ప్రజాపాలన అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి.

Aug 1, 2024 - 15:29
 0  6
అక్రమ అరెస్టులే ప్రజాపాలన అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి.

మహిళా ఎమ్మెల్యేలను అవమానించిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి

తక్షణమే సీఎం పదవి నుండి తొలగిపోవాలి

 బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కో- ఆర్డినేటర్ కురువ పల్లయ్య

ఖబర్దార్ రేవంత్ రెడ్డి..

ఐజ మండల కేంద్రంలో దిష్టిబొమ్మ దగ్ధం చేసే సమయంలో అక్రమంగా బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ను మరియు అలంపూర్ నియోజకవర్గం నాయకురాలు ప్రేమలత ను అరెస్టు చేసిన ఐజ మండల ఎస్సై విజయ్ భాస్కర్ మరియు పోలీసులు

*నిన్న అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు యావత్ మహిళా సమాజాన్ని కించపరిచాయని బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కో- ఆర్డినేటర్ కురువ పల్లయ్య అన్నారు.

 ఐజ మండలంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్నం

 ఈ సందర్బంగా జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య మాట్లాడుతూ.. ఒక నిండు చట్టసభలో అనేకసార్లు ఎమ్మెల్యేగా,మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రా రెడ్డి గారిని,సునీత లక్ష్మారెడ్డి గారి  ఉద్దేశించి మాట్లాడుతూ వెనకాల కూర్చున్న అక్కలను నమ్ముకుంటే జూబ్లీహిల్స్ బస్టాండ్ లో అడుక్కోవడమే  తప్ప ఇంకోటి ఉండదని మాట్లాడడం ఏమాత్రం  సమంజసం కాదని, ఈ మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం నీచమైన చర్యని అన్నారు. 

భారతీయ కుటుంబ వ్యవస్థలో మహిళలకు అగ్రస్థానం ఉన్నదని,"ఎత్రానర్యస్తు పూజ్యంతే - తత్రారమంతే దేవత"అని మహిళలను గౌరవించుకునే సమాజంలో, చట్టసభల్లో అనుభవం కలిగిన మహిళా ఎమ్మెల్యేలను కించపరిచినట్లు మాట్లాడడం  రేవంత్ రెడ్డి నీచమైన రాజకీయాలకు నిలువుటద్దమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలకుక్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రేవంత్ రెడ్డికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చిన్న, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333