SBI 20 లక్షల ఇన్సూరెన్స్ భీమా చెక్ అందజేత

Oct 27, 2025 - 20:58
 0  1
SBI 20 లక్షల ఇన్సూరెన్స్ భీమా చెక్ అందజేత

తెలంగాణ వార్త ఆత్మకూరుఎస్ 20 లక్షల ఇన్సూరెన్స్ భీమా చెక్ అందజేత ఆత్మకూర్ ఎస్....జీవిత బీమా ప్రతి ఒక్క కుటుంబానికి భద్రత కల్పిస్తుందని ఎస్బిఐ సూర్యాపేట రీజినల్ మేనేజర్ బి. అనిల్ కుమార్ అన్నారు. ఇటీవల మండల కేంద్రానికి చెందిన గుణగంటి మధు బైక్ ప్రమాదంలో చనిపోవడంతో అతని భార్య స్వప్నకి ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ వారి నుంచి 20 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవిత బీమా పాలసీ తీసుకోవాలని.. ఎప్పుడు ఎం జరుగుతుందో ఎవరికి తెలియదని మనం ఉన్నా లేకున్నా జీవిత బీమా కుటుంబానికి భద్రత కల్పిస్తుందని అన్నారు. గునగంటి మధు రెండు సంవత్సరాల క్రితం సంవత్సరానికి ₹1000 మాత్రమే బీమా చేశాడని కానీ ఆ వెయ్యి రూపాయల పాలసే ఈరోజు వాళ్ళ కుటుంబానికి 20 లక్షలు వచ్చేలా చేసిందని తెలిపారు. అతని ముందు చూపు వల్ల వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడకుండా జీవిస్తారు అని అన్నారు. అనంతరం మధు భార్య స్వప్న కి 20 లక్షల రూపాయాల చెక్కు ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ విద్యాసాగర్, ఆత్మకూర్ బ్రాంచ్ మేనేజర్ బి. సుమన్, ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్ సూర్యాపేట రీజినల్ మేనేజర్ విక్రం, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.