12వ వార్డులో జోరుగా ఇంటింటి ప్రచారం
ఆదరించండి అభివృద్ధి చేస్తాను
12వ వార్డు స్వతంత్ర అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేసిన గంట మౌనిక సుమంత్
తిరుమలగిరి 31 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇంటింటి ప్రచారంలో తిరుగుతూ ఓటర్లలతో మమేకమై వార్డులోని ప్రతి సమస్యను తెలుసుకుంటూ ప్రజా సమస్యలపై ఎల్లవేళల పోరాడుతానని అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు అనంతరం వార్డులో ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తూ ప్రచారం ప్రచారం నిర్వహించారు
మున్సిపల్ 12 వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థి గంట మౌనిక సుమంత్ . అనంతరం ఆమె ప్రజలతో మాట్లాడుతూ ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా 12వ వార్డు నుండి తనను వార్డు ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. వార్డులో గత ప్రభుత్వంలో పేరుకుపోయిన సమస్యలన్ని పరిష్కరిస్తానని అన్నారు. అత్యధిక మెజార్టీతో వార్డ్ ప్రజలు గెలిపించాలని ఆమె కోరారు.