సాయి గాయత్రి విద్యాలయంలో కన్నుల పండుగగా ఐదవ వార్షికోత్సవ వేడుకలు
మునగాల 24 మార్చి 2024
తెలంగాణ వార్త ప్రతినిధి :-
మునగాలలోని సాయి గాయత్రి విద్యాలయ లో శనివారం పాఠశాల వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి సలీం షరీఫ్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు, ఆ తర్వాత విద్యార్థిని విద్యార్థులచే ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలను వేలాదిగా వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పుర ప్రజలు మరియు మండలం నుండి విచ్చేసిన శ్రేయోభిలాషులు తిలకించారు ఈ కార్యక్రమంలో సుమారుగా విద్యార్థిని విద్యార్థుల చే 18 నుండి 20 పాటలు మరియు స్కిట్స్ ప్రదర్శించబడ్డాయి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రిన్సిపల్ అర్వపల్లి శంకర్ పాఠశాల గురించి మరియు విద్యార్థుల ప్రదర్శన గురించి మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో మునగాల మండలంలో ఒక ఉన్నతమైన పాఠశాలగా మునగాల మండల ప్రజలు సాయి గాయత్రిని ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం కష్టపడ్డ ఉపాధ్యాయ బృందానికి ఎన్నో వ్యయ ప్రయాసల కు ఓర్చి పిల్లలచే తక్కువ సమయంలో ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నించిన డాన్స్ మాస్టర్ గురు స్వామిని ఏవిధంగా స్టేజ్ డెకరేషన్కు మరియు మైక్ అండ్ లైటింగ్ ఏర్పాటుచేసిన రాజు మరియు శివలను ప్రత్యేకంగా అభినందించారు అలాగే ఇలాంటి కార్యక్రమాలు పాఠశాలలో క్రమం తప్పకుండా నిర్వహిస్తామని మీ ఆశీర్వాదం మీ సహకారం ఇలాగే ఉండాలని విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులను కోరారు.