హంస ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

Aug 30, 2026 - 19:36
Aug 30, 2026 - 19:40
 0  3
హంస ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు  పుస్తకాల పంపిణీ

తిరుమలగిరి 31 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో హంస ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాల పిల్లలకు డిజిటల్ నోట్ పుస్తకాలను డాక్టర్ చెరుకు సుధాకర్  జన్మ దినోత్సవం సందర్భంగా  సతీమణి హంస ఫౌండేషన్ చైర్మన్ చెరుకు లక్ష్మీ  సహకారం తో పిల్లల చదువుకు అవసరమైన డిజిటల్ నోట్ పుస్తకాలను అందించడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మారిపల్లి సైదులు మాట్లాడుతూ పుస్తకాలను అందించడం చాలా సంతోషంగా ఉందని అన్ని దానాల్లో కెల్లా విద్యాదానం గొప్పదని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో మార్పు సొసైటీ అధ్యక్షుడు పోరెళ్ల విప్లవ్ కుమార్ గ్రామ అభ్యుదయ కమిటీ సభ్యులు గొడుగు రమేష్, టీజీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగులగాని హరీష్ హోలియదాసరి విద్యార్థి హక్కుల సంఘం నాయకులు అనగందుల సంపత్ తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి