స్థానిక సమస్యలు పరిష్కరించాలి.CPI[M

Mar 13, 2025 - 21:02
 0  19
స్థానిక సమస్యలు పరిష్కరించాలి.CPI[M

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ మండల పరిధిలో  ఏపూర్:-స్థానిక గ్రామంలోCPM పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పోరుబాట యాత్రలో భాగంగా ఏపూర్ గ్రామంలో నిర్వహించిన సర్వేలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అవిరి అప్పయ్య పాల్గొని మాట్లాడుతూ. బొప్పారం రోడ్డులో గల మల్లన్న దేవుడి వెళ్లే దారిలో ఉన్న బోరు గత నాలుగు నెలల నుంచి మోటార్ కాలిపోయినందున నడుస్తలేదు ఆ సమస్యను కూడా పరిష్కరించాలి అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారని అని వారన్నారు మంచినీటి సమస్యను అదేవిధంగా డ్రైనేజీలో మురిగినీరుతో నిల్వ ఉండడంతో దుర్వాసన వస్తుందని దాని ఫలితంగా గ్రామంలో దోమల బెడద తీవ్రంగా ఉందని దోమలతో అందరూ రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైన్ల లీకేజీ వీధిలైట్లను కూడా పరిశీలించి వాటి కూడా మరమతులు చేయించాలని వారి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని గ్రామపంచాయతీ కార్యాలయంలోని కరోబార్ కి  ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ కార్యదర్శి సానబోయిన ఉపేందర్ మండల కమిటీ సభ్యులు ఎరుకల నాగరాజు శాఖ కార్యదర్శి వరికుప్పల మహేష్ అవిరె సాయి. నవిల లింగయ్య మధుసూదన్ కుంభం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.