స్కూల్ విద్యార్థుల పై ఆటోడ్రైవర్లు శ్రద్ధ వహించాలి:సీఐ టంగుటూరి శ్రీను
ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలపై అవగానా కల్పిస్తున్న సీఐ
జోగులాంబ గద్వాల 3 జనవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల ఉదయం,సాయంత్రం వెళ్ళల్లో స్కూల్ విద్యార్థులను తీసుకెళ్లే ఆటో డ్రైవర్లు, ఆటోలను నడిపే సమయంలో విద్యార్థులపై శ్రద్ధ వహించి,తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని గద్వాల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టంగుటూరు శ్రీను అన్నారు.జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ ఇన్స్టిట్యూట్ కార్యాలయం లో శుక్రవారం ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాలతో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై మరియు రోడ్డు ప్రమాదాల ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు,టౌన్ ఎస్సై కళ్యాణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగ సీఐ టంగుటూరు శ్రీను ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ...ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి అయన పలు సూచనలను చేశారు.ఆటోలో ప్రయాణించే ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తిస్తూ, రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. మద్యం సేవించి ఆటోలను నడపడం, నిర్లక్ష్యంగా రోడ్లపై ఇష్టానుసారంగా ఆటోలను నిలిపివేసి, ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి గురించి తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. డ్రైవర్ సీటు వెనక భాగంలో డ్రైవర్ పేరు, ఫోన్ నెంబరును ప్రయాణికులకు కనిపించే విధంగా కచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.పట్టణం లో కొన్ని రోజులుగా జరుగుతున్నా దొంగతనాల విషయంలో కూడా డ్రైవర్ల అప్రమత్తంగా అనుమానం ఉన్న వ్యక్తులపై కూడా ఏదైనా సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియజేసారు.ఆటోలను మితి మీరు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు. తమ వెనుక కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారని గుర్తుపెట్టుకుని ఆటోలు సురక్షితంగా నడుపుకోవాలన్నారు. లైసెన్స్‌లు తప్పకుండా తీసుకోవాలన్నారు. తాగి వాహనాలు నడపవద్దని.ఆటోలో ప్రయాణించే ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తిస్తూ, రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. మద్యం సేవించి ఆటోలను నడపడం, నిర్లక్ష్యంగా రోడ్లపై ఇష్టానుసారంగా ఆటోలను నిలిపివేసి,ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఆటోలను నడపాలని, ఆటో రిజిస్ర్టేషన్ నెంబర్ కనబడేలా ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసమే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సీఐ అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది,కానిస్టేబుల్ పాల్గొన్నారు.