సైబర్ నేరాలపై యువత అప్రమత్తంగా ఉండాలి

Jan 15, 2025 - 20:54
Jan 15, 2025 - 21:30
 0  7
సైబర్ నేరాలపై యువత అప్రమత్తంగా ఉండాలి

ఆత్మకూరు యస్ 14 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్ :- సైబర్ నేరాలపై యువత అప్రమత్తంగా ఉండాలి. ఆత్మకూర్ సైబర్ నేరాలపై యువత అప్రమత్తంగా ఉండాలని హెడ్ కానిస్టేబుల్ అబ్బ గాని సోమయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలో సైబర్ నేరాలపై యువకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల ఆన్లైన్ మోసాలతో యువత ఇబ్బందులు పడుతున్నారని, స్పామ్ కాల్స్ ఎవరు ఎత్తవద్దని అధికారులు నాయకుల పేర్లతో డిజిటల్ అరెస్ట్ లాంటి ప్రచారాలను నమ్మవద్దని అన్నారు ఈ కార్యక్రమంలో సిబ్బంది సోమని నాగార్జున వెంకటేష్ యువకులు తదితరులు పాల్గొన్నారు